Nayanathara Twin Boys Names: ఉయిర్, ఉలగ్..నయనతార కొడుకులకు ఇంట్రెస్టింగ్ నేమ్స్.. అర్ధం ఏంటో తెలుసా..?
Nayanathara Son Names Meaning: నయనతార, విగ్నేష్ శివన్ దంపతుల కుమారులకు పేర్లు పెట్టారు, తాజాగా చెన్నైలో జరిగిన ఒక ఈవెంట్లో ఈ పేర్లు పెట్టగ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా అనౌన్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే
Nayanthara Reveals full Names of her Twin Boys: గతంలో అనేకమందితో ప్రేమాయణం నడిపిన నయనతార గత ఏడాది తాను ప్రేమించిన విగ్నేష్ శివన్ అనే దర్శకుడిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహ మహోత్సవం చాలా ఘనంగా జరిగింది. ఎవరూ ఊహించని విధంగా వీరి వివాహం జరిగిన తర్వాత తమిళనాడులో ఉన్న అనాధ పిల్లలందరికీ అలాగే వృద్ధ ఆశ్రమాలకు ఆ రోజు మొత్తం భోజన సదుపాయాలు చూసుకున్నారు. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఇద్దరు వివాహం జరిగిన కొన్నాళ్లకే తల్లిదండ్రులు అయ్యారు.
సరోగసి ద్వారా నయనతార ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఈ మగ పిల్లలను ఇప్పటివరకు మీడియా కంట పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ తల్లిదండ్రులు. ఇక తాజాగా వీరిద్దరి నామకరణం చేసినట్లు తెలుస్తోంది. వారిద్దరి పేర్లను తాజాగా విగ్నేష్ శివన్ తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అందులో మొదటి కుమారుడి పేరు ఉయిర్ రుద్రో నీల్ ఎన్ శివన్, రెండవ కుమారుడు పేరు ఉలగ్ దైవిక్ శివన్ అని పెట్టినట్లుగా ప్రకటించాడు.
అంతే కాదు వీటిలో ఎన్ అంటే ప్రపంచంలోనే గొప్ప తల్లి నయనతార అని ఆయన చెప్పుకొచ్చాడు. ఇక శివన్ అంటే తన పేరులో సగం అంటూ ఆయన కామెంట్ చేశారు. ఇక తన కుమారుల పేర్లు ప్రకటించడాన్ని తన బాధ్యతగా భావిస్తున్నానని నాకు మీ అందరి ఆశీస్సులు కావాలని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇక అంతేకాక నయనతారతో కలిసి ఉన్న ఫోటోలను కూడా విగ్నేష్ శివన్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
ఇక ఆయన చేసిన ఫోటోలలో సముద్రం ఒడ్డున కూర్చుని సూర్యోదయాన్ని చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇక వీరిద్దరి కుమారుల పేర్లను ప్రకటించడంతో వీరి కుమారులను బ్లెస్ చేస్తూ అందరూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సెలబ్రిటీలు మాత్రమే కాదు సాధారణ నెటిజన్లు సైతం పేర్లు అద్భుతంగా ఉన్నాయని మరికొందరైతే పిల్లల్ని చూస్తుంటే బొమ్మలను చూస్తున్నట్లుగానే ఉందని అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు పిల్లల మొహాలు చూపించరా మాకు అంటూ కూడా కామెంట్లు పెడుతున్నారు.
Also Read: Dasara Movie: ఏం సినిమారా బాబూ.. దసరా గురించి ప్రభాస్ పోస్ట్ వైరల్!
Also Read: Viduthalai Part 1 Telugu Release: తమిళ్లో సూపర్ హిట్ అయిన విడుతలై.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook