Vignesh Shivan shares an adorable post after wedding with nayanthara: స్థార్ హీరోయిన్ నయనతార, డైరెక్టర్ విఘ్నేష్‌ శివన్‌ గురువారం (జూన్ 9) వివాహబంధంలోకి అడుగుపెట్టారు. కోలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ వివాహం మహాబలిపురంలోని షెరిటన్‌ రిసార్ట్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. హిందూ సంప్రదాయ రీతిలో జరిగిన ఈ పెళ్లిలో నయనతార ఎర్ర చీరలో మెరిసిపోయారు. ఈ పెళ్లి వేడుక అత్యంత సన్నిహితులు, బంధువుల మధ్య జరిగింది. పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. నూతన జంటకు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రేయసి నయనతారని పెళ్లాడిన విఘ్నేశ్‌ శివన్‌.. పెళ్లి జరిగిన వెంటనే తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. పెళ్లికి సంబంధించిన ఫొటోలను విఘ్నేష్‌ గురువారం సాయంత్రం తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. 'ఆన్‌ ఏ స్కేల్‌ ఆఫ్‌ 10.. ఆమె తొమ్మిది నేను ఒకటి. నయన్‌, నేను ఒక్కటయ్యాం. భగవంతుడి ఆశీస్సులు, తల్లిదండ్రులు, స్నేహితులు, అందరి ఆశీస్సులతో మా పెళ్లి బాగా జరిగింది. ఇప్పుడే నయనతారను వివాహం చేసుకున్నా' అని విఘ్నేశ్‌ ట్వీట్ చేశాడు.


విఘ్నేశ్‌ శివన్ మరో ట్వీట్ కూడా చేశాడు. 'దేవుడికి కృతజ్ఞతలు. మొదటగా నేను నయతారను మేడమ్‌ అని పిలిచేవాడిని. ఆ తర్వాత నయన్‌ నా జీవితంలో పలు రకాలుగా మారారు. నయతార మేడమ్‌ నుంచి కాదంబరిగా.. ఆపై తంగమే, మై బేబి, మై లైఫ్‌, ఓ కనుపాప అయ్యారు. ఇప్పుడు నా సతీమణి అయ్యారు. చాలా సంతోషంగా ఉంది' అని భావోద్వేగం చెందారు. వవ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. 



2016లో వచ్చిన ‘నేను రౌడీనే’ సినిమాతో నయనతార, విఘ్నేష్‌ శివన్‌ మధ్య పరిచయం అయింది. అప్పటీకే ప్రేమలో విఫలమయిన నయన్.. శివన్‌కు దగ్గరైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. 2017లో సింగపూర్‌లో జరిగిన అవార్డుల ఫంక్షన్‌కు నయన్, విఘ్నేష్‌ కలిసి వెళ్లారు. ఆపై ఓ రోజు నయన్‌కు విఘ్నేష్ అసలు విషయం చెప్పేశాడట. అనంతరం ఇద్దరు కలిసి 5-6 ఏళ్లు ప్రేమలో ఉండి చివరకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నేడు (జూన్ 10) తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకోనుంది నూతన జంట. 


Also Read: Ante Sundaraniki Twitter Review: రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌.. సినిమా చివరి వరకు నవ్వుతూనే ఉన్నా!


Also Read: Gold Silver Price Today: పెరిగిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తాజా రేట్ల వివరాలు ఇవే!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook