Balakrishna about Sridevi:  తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అతిలోకసుందరిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి భూ లోకసుందరిగా కూడా పేరుగాంచింది. తెలుగు , తమిళ్,  హిందీ భాషల్లో ఫుల్ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె తెలుగు స్టార్ హీరోయిన్ గా మరింత పేరు సొంతం చేసుకుంది.  ఎన్టీఆర్ , ఏఎన్ఆర్, కృష్ణ వంటి పాతతరం హీరోలను మొదులుకొని..  వెంకటేష్, చిరంజీవి, నాగార్జున వంటి రెండో తరం హీరోల వరకు అందరితో కూడా జతకట్టింది ఈ ముద్దుగుమ్మ. అయితే రెండో తరం హీరోలలో ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణతో మాత్రం ఈమె ఒక్క సినిమాలో కూడా నటించలేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిజానికి బాలకృష్ణ,  శ్రీదేవి కాంబినేషన్లో సినిమా కోసం అభిమానులు ఎంతో ఎదురు చూశారు.  కానీ నిరాశ తప్పలేదు.  అయితే వీరిద్దరూ కలిసి నటించకపోవడానికి ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి . కానీ తాజాగా దీనిపై బాలకృష్ణ స్పందించారు. 1974లో వచ్చిన తాతమ్మ కళ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన బాలకృష్ణ ఈ ఏడాదితో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఇక సినీ ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో హైదరాబాదులో ఘనంగా ఈవెంట్ నిర్వహించారు. 


ఈ సందర్భంగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినీ , రాజకీయాలతో పాటు తన వ్యక్తిగత జీవితం గురించి కూడా ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు బాలయ్య.  అందులో భాగంగానే శ్రీదేవితో ఎందుకు నటించలేదు అనే విషయాన్ని కూడా ఆయన వివరించారు. 


బాలకృష్ణ మాట్లాడుతూ..  శ్రీదేవితో నటించకపోవడానికి కారణాలు ఏవి లేవు.  కానీ యాదృచ్ఛికంగా అలా జరిగిపోయింది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఏ సినిమాలో అయినా సరే ఆర్టిస్ట్ ఎంపిక చాలా ముఖ్యం.  శ్రీదేవి లాంటి గొప్ప యాక్టర్ ను సాదాసీదా సినిమాలో పెడితే అసలు బాగుండదు. అలా ఒకటి రెండు సినిమాలలో శ్రీదేవిని పెట్టాలని బలవంతంగా చూశారు కానీ నేనే వద్దని చెప్పాను అంటూ బాలకృష్ణ క్లారిటీ ఇచ్చారు. 


అంతేకాదు శ్రీదేవి స్థాయి వేరని,  ఆమెతో సినిమా చేయాలి అంటే అంతకుమించి కథ అద్భుతంగా వుంటేనే అప్పుడు సరిపోతుంది అంటూ బాలకృష్ణ తన అభిప్రాయంగా చెప్పుకొచ్చారు. అలాగే చిరంజీవితో శ్రీదేవి నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాను కూడా గుర్తు చేశారు బాలకృష్ణ. అందులో ఆమె దేవకన్యలా ఉందని,  అలాంటి ఆమెను తెచ్చి చిన్న చిత్రాలలో పెడితే ఆమె స్థాయిని తగ్గించినట్టే అవుతుంది అంటూ తెలిపారు.


Also Read: No Selfies: తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిక! జలాశయాల వద్ద సెల్ఫీలు.. ఫొటోలు వద్దు


Also Read: Narendra Modi: తెలంగాణలో వరదలపై ప్రధాని మోదీ ఆరా.. అండగా ఉంటామని భరోసా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter