NBK 109 Vs Devara: నందమూరి బాలకృష్ణ .. జూనియర్ ఎన్టీఆర్‌ను ఒదిలిపెట్టనంటున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కతోన్న 'దేవర పార్ట్ -1' మూవీని ముందుగా ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అపుడే బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో నటిస్తోన్న NBK 109 మూవీని అదే రిలీజ్ డేట్‌లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ తీరా ఈ రెండు సినిమాల షూటింగ్స్ లేట్ కావడంతో ఈ సినిమాల రిలీజ్ డేట్స్ అనివార్యంగా వాయిదా పడ్డాయి. అందులో ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న 'దేవర' మూవీని అక్టోబర్ 10న దసరా కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక బాబాయి బాలయ్య కూడా తన 109 చిత్రాన్ని ఇంచు మించు దసరా బరిలో అక్టోబర్ 10న లేదా ఒకటి రెండు రోజులు అటు ఇటుగా రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత కొన్నేళ్లుగా రాజకీయంగా బాబాయి, అబ్బాయిలకు సఖ్యత లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం పేరు మార్పు, మేనత్త భువనేశ్వరిపై వైసీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై సరైన విధంగా స్పందించకపోవడంతో వీళ్లిద్దరి మధ్య దూరం పెరిగనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ను రాజకీయంగానే కాకుండా సినిమాల పరంగా బాలకృష్ణ పోటీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఒకవేళ అదే డేట్‌కు అటు ఇటుగా సినిమా వస్తే 2016 సంక్రాంతి బరిలో డిక్టేటర్, నాన్నకు ప్రేమతో సినిమాల తర్వాత వీళ్లిద్దరి సినిమాలు ఒకే సమయంలో విడుదల కావడం రెండోసారి అవుతుంది.


బాలయ్య.. గతేడాది దసరా కానుకగా 'భగవంత్ కేసరి' మూవీతో పలకరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇపుడు అదే ఊపులో 109వ చిత్రాన్ని కూడా విజయ దశమి కానుకగా విడుదల చేసి విజయం అందుకోవాలనే కసితో బాలయ్య ఉన్నట్టు తెలుస్తోంది.


అటు దేవర విషయానికొస్తే.. ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్ ఇమేజ్ గ్లోబల్ లెవల్లో పెరిగింది. అందుకే ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమాపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా తర్వాత 'వార్ 2' మూవీతో పాటు దేవర పార్ట్ 2 లైన్లో ఉన్నాయి. వీటితో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' మూవీ  కూడా లైన్‌లో ఉంది. ఇంకోవైపు పలువురు ప్యాన్ ఇండియా డైరెక్టర్స్ ఎన్టీఆర్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని పలు కథలను రెడీ చేస్తున్నారు. మొత్తంగా అబ్బాయి పోటీగా బాబాయి తన సినిమాను అదే డేట్‌లో రిలీజ్ చేస్తారా లేదా అనేది చూడాలి.


Also Read: Low Depression: బంగాళాఖాతంలో అల్పపీడన హెచ్చరిక, ఏపీలో అతి భారీ వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter