NBK 109: బాలయ్య సినిమా కోసం మరోసారి ఆ హిట్ సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తోన్న దర్శకుడు బాబీ..
NBK 109 - Balakrishna: బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన `అఖండ` నుంచి బాలయ్య కెరీర్ పరుగులు పెడుతోంది. అంతేకాదు దాదాపు మూడు దశాబ్దాల తర్వాత హాట్రిక్ హిట్స్ అందుకున్నారు. ఈ జోష్‌లోనే బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్లో బాలయ్య పవర్ఫుల్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా కోసం బాబీ మరోసారి ఆ హిట్ సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తున్నాడట.
NBK 109 - Balakrishna: నందమూరి బాలకృష్ణ తన కెరీర్‌లో ఎన్నడు లేనంత ఫుల్ జోష్‌లో ఉన్నాడు. అఖండ మూవీతో ప్రారంభమైన బాలకృష్ణ ప్రభంజనం.. ఆ తర్వాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి మూవీలతో కంటిన్యూ అయింది. దాదాపు 30 యేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత బాలయ్య హాట్రిక్ హిట్స్ అందుకున్నారు. ఈ జోష్‌లోనే ఇపుడు బాబీ కొల్లి దర్శకత్వంలో నెక్ట్స్ 109 మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ భారీ ఎత్తున తెరకెక్కిస్తోంది. బాబీ విషయానికొస్తే.. లాస్ట్ ఇయర్ చిరంజీవితో వాల్తేరు వీరయ్యతో మంచి హిట్ అందుకున్నారు. ఇపుడు బాలయ్యను ఇప్పటి వరకు ఎవరు చూపించిని విధంగా కొత్తగా చూపించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో బాలయ్య మరోసారి డాన్ పాత్రలో కనిపించబోతున్నాడు. బాబీతో చేస్తోన్న సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక మహా శివరాత్రి పర్వదినం సందర్బంగా విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ సినిమాలో బాలయ్య మరోసారి రెండు విభిన్న పాత్రల్లో అలరించనున్నడానే మ్యాటర్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతుంది.
రీసెంట్‌గా బాలకృష్ణ డ్యూయల్ రోల్లో యాక్ట్ చేసిన 'అఖండ', వీరసింహారెడ్డి, అంతకు ముందు.. లెజెండ్, సింహా బాలయ్య రెండు విభిన్నపాత్రల్లో నటించిన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. ఇపుడు అదే కోవలో బాబీ.. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రలను డిఫరెంట్‌గా వెండితెరపై ఆవిష్కరించబోతున్నడట.ఇక ఈ సినిమా పేరున తెలుగు నూతన సంవత్సాది ఉగాది కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ కూలెస్ట్ మరియు క్రూయలెస్ట్ గా కనిపించనున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ గ్లింప్స్‌లో బాలకృష్ణ తన టూల్ బాక్స్‌లో ఆయుధాలతో పాటు మాన్షన్ హౌస్ ఆల్కహాల్ బాటిల్ ని తీసుకెళతాడు. రౌడీలు తన వైపు పరుగెత్తుకుంటూ వస్తుంటే, బాలయ్య కూల్ గా ఆల్కహాల్ తాగడం గూస్ బంప్స్ తెప్పించాయి "ఏంట్రా వార్ డిక్లేర్ చేస్తున్నావా?" అని ప్రత్యర్థి గ్యాంగ్ లోని వ్యక్తి అడగగా.. "సింహం నక్కల మీదకు వస్తే వార్ అవ్వదురా లఫూట్.. ఇట్స్ కాల్డ్ హంటింగ్" అంటూ పవర్ ఫుల్ డైలాగ్ తో బాలకృష్ణ వేట మొదలుపెట్టడం ఫ్యాన్స్‌కు కిక్ ఎక్కించేలా ఉంది.
ఈ సినిమాలో బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో ఒకప్పటి బాలీవుడ్ యాక్షన్ హీరో బాబీ దేవోల్ నటిస్తున్నారు. ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. రీసెంట్‌గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన 'యానిమల్' మూవీలో బాబీ దేవోల్ విలన్‌గా ఏ రేంజ్ పర్ఫామ్ చేసాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇపుడు ఈ సినిమాలో బాలయ్యను వెండితెరపై ఢీ కొట్టే సీన్స్ హైలెట్స్‌గా నిలువనున్నట్టు మేకర్స్ చెబుతున్నారు. డిక్టేటర్, అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాల తర్వాత బాలయ్య సినిమాకు థమన్ సంగీతం సమకూర్చుతున్నారు. జైలర్ ఫేమ్ విజయ్ కార్తీక్ సినిమటోగ్రఫీ అందిస్తున్నారు. నిరంజన్ రెడ్డి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను ఉగాది కానుకగా వెల్లడించనున్నారు
Also Read: KT Rama Rao: కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం.. కవిత అరెస్ట్‌తో వెళ్తారా లేదా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook