NBK@50Years: నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలు..గ్రాండ్ గా కర్టన్ రైజర్ కార్యక్రమం..
NBK@50Years: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ ఈ నెల 29తో 50 యేళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 1వ తేదిన ఫిల్మ్ ఇండస్ట్రీ తరుపున బాలయ్యను ఘనంగా సత్కరించనున్నారు. దానికి సంబంధించి కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్ ఘనంగా జరిగింది.
NBK@50Years:నందమూరి బాలకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక హీరో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం ఆషామాషీ కాదు. 50 యేళ్లుగా ఒక నటవారసుడిగా చిత్ర పరిశ్రమలో హీరోగా కొనసాగడం అంతా ఈజీ కాదు. మొత్తంగా ప్రపంచ సినీ చరిత్రలో ఓ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి 50 యేళ్లుగా హీరోగా నటిస్తున్న నటుడు మరెవరు లేరు. ఈ 50 యేళ్ల ప్రస్థానంలో 90 శాతం సినిమాల్లో టైటిల్ రోల్స్ పోషించిన వారు మరెవరు లేరు.‘తాతమ్మ కల’ చిత్రంతో తెరంగేట్రం చేసిన నందమూరి బాలకృష్ణ యాక్టర్ గా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 109వ సినిమా చేస్తున్నారు. బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న ఈ హ్యాపీ మూమెంట్ లో ఆయన స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 1న జరగబోయే వేడుకకు సంబంధించిన క్టరన్ రైజర్ కార్యక్రమాన్ని ఎఫ్‌ఎన్‌సీసీలో ఘనంగా నిర్వహించారు. ఎంతోమంది అతిరథ మహారథులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో బాలయ్య సోదరులు నందమూరి రామకృష్ణ, నందమూరి మోహనకృష్ణ ఇద్దరూ స్వర్ణోత్సవ వేడుకల పోస్టర్‌ను లాంఛ్ చేయడం విశేషం.
ఈ కార్యక్రమంలో నందమూరి మోహనకృష్ణ మాట్లాడుతూ..
‘‘మా తమ్ముడు బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం మాములు విషయం కాదు. ఎలాంటి పాత్రనైనా చేయగల నటుడిగా పేరు తెచ్చుకున్నారు. మా నాన్న గారికి వారసుడిగా బాలకృష్ణ ఇండస్ట్రీలో నిలబడ్డారు. నటనలోనే కాకుండా రాజకీయాల్లో కూడా నాన్నగారికి వారసుడిగా బాలకృష్ణ ఉన్నారు. మొన్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. హిందూపురం అడ్డా నందమూరి గడ్డ అని నిరూపించారన్నారు.
సీనియర్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి మాట్లాడుతూ..
‘‘బాలయ్యతో ఎక్కువ సినిమాలు చేసింది నేనే. 13 సినిమాలు ఆయనతో చేశానంటే ఆయన ఎంత మంచి వాడో అర్థమవుతుంది. అన్నగారి బాటలోనే బాలయ్య కూడా దర్శకులకు ఎంతో గౌరవం ఇస్తారన్నారు. 50 ఏళ్లు హీరోగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఈ ప్రస్థానంలో నేను కూడా ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ మధ్య ఎక్కడికెళ్లినా జై బాలయ్య అని అంటున్నారు. యూత్ నాడి పట్టుకున్న నటుడు బాలకృష్ణ. రామారావుగారి వారసుడిగా సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ మంచి పేరు తెచ్చుకున్నారు.
దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా మాట్లాడుతూ..
‘‘బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నా కూడా కుర్రహీరోలకు ఏమాత్రం తగ్గకుండా పోటీ ఇస్తున్నారు. ఇండియన్ సినిమాలో అమితాబ్ బచ్చన్ తర్వాత బాలకృష్ణే ఇన్ని ఏళ్లు నటుడిగా చేసిన వాళ్లు ఎవరూ లేరన్నారు.ఆయన 50 వసంతాలు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. సినీ ఇండస్ట్రీ అంతా కలిసి చేస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ..
‘‘రామారావు గారి నట వారసుడు నందమూరి బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు ఇండస్ట్రీ మొత్తం కలిసి టాలీవుడ్ పవర్ ఏంటో చూపించేలా గొప్పగా చూపించబోతున్నాము.
నిర్మాత కైకాల నాగేశ్వరరావు మాట్లాడుతూ..
‘‘ నందమూరి ఫ్యామిలీతో మా ఫ్యామిలీకి చాలా అవినాభావ సంబంధాలున్నాయి. మా సోదరుడు కైకాల సత్యనారాయణను రామారావుగారు సొంత తమ్ముడిలా చూసుకునేవారు. నిర్మాతలకు గౌరవం ఇవ్వడంలో అన్నగారి తర్వాత ఆయన వారసుడు బాలకృష్ణ కూడా ముందు వరుసలో ఉంటారు. నిర్మాత బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుందని బాలయ్య నమ్ముతారు. అలాంటి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలనుకోవడం ఆనందించదగ్గ విషయమన్నారు.
దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ..
‘‘బాలకృష్ణ గారి స్వర్ణోత్సవ వేడుకలను ఒక ప్రతిష్టాత్మక వేడుకగా చేస్తున్నాం. సౌత్ భారత్ నుంచి ఎంతోమందిని ఆహ్వానిస్తున్నామన్నారు.
ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ మాట్లాడుతూ..
‘‘సెప్టెంబర్ 1న ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి మీ అందరి సహకారం కావాలని కోరుతున్నాను.
సీనియర్ నిర్మాత సీ కల్యాణ్ మాట్లాడుతూ..
‘‘మా బాలయ్య గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ జరుగుతోందంటే నాకు భయంగా ఉంది. ఆయన సినిమాలు, ఆయన కలెక్షన్స్ అన్నీ రికార్డులకెక్కాయి.
దర్శకనిర్మాత వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ..
‘‘1974 మేలో గుడివాడలో తాతమ్మ కల సినిమా చూశా. అక్కడి నుంచి 50 ఏళ్లు మా కళ్ల ముందు గిర్రున తిరిగి ఇంత దూరం వచ్చేశామా అనేది ఒక కలలా అనిపిస్తోంది.
తుమ్మల ప్రసన్నకుమార్ మాట్లాడుతూ
..‘‘హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికీ హ్యాట్రిక్ హీరోగా, హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డులు క్రియేట్ చేసారు. అలాగే బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి సేవలందరిస్తున్నారు.
రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ..‘
‘నేను రామారావుగారి అభిమానిని. నేను అభిమానించిన రామారావు సినిమా రాయడం అనేది మాకు దొరికిన అదృష్టం. 1981లో నేను ఛండశాసనుడు సినిమాకు రాశాను. ఆ టైమ్‌లో ఒక అందమైన కుర్రాడు వచ్చాడు. అతనే బాలకృష్ణ.
డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ..‘‘50 నిమిషాల పాటు వాక్ చేస్తేనే మనం అలసిపోతాం. అలాంటిది ఆయన 50 ఏళ్లుగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. అలాంటి ఆయన కష్టాన్ని గుర్తించి సినిమా పెద్దలందరూ ఒక వేదిక మీదకు వచ్చి ఆయనకు సన్మానం చేయడం చాలా అభినందనీయమైన విషయమన్నారు.
ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..
ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter