Samantha Divorce:సెలబ్రిటీల జీవితాల్లో ఏం జరిగినా అది సోషల్ మీడియా సెన్సేషన్ అనడంలో ఎటువంటి డౌట్ లేదు. వాళ్ల ప్రేమ దగ్గర నుంచి పెళ్లి వరకు.. పిల్లల దగ్గర నుంచి విడాకుల వరకు.. ప్రతిదీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. అలా పెళ్లి చేసుకొని విడిపోయి ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జంట నాగచైతన్య, సమంత.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అక్కినేని నాగచైతన్య ,సమంత ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు ఎంతో అన్యోన్యంగా సాగిన వారి కాపురం అనూహ్యంగా డైవర్స్ వరకు వెళ్ళింది. విడాకులకు కారణం ఇది అన్న విషయం ఇప్పటికి కూడా ఎవరికీ తెలీదు. వీళ్ళిద్దరూ విడిపోయి సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఎవరో ఒకరు వీళ్ళ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. కొందరు ప్రశ్నిస్తుంటే మరికొందరు ఇంకొంచెం ముందుకొచ్చి నిందిస్తూ కూడా ఉంటారు. అయితే ఈ ఇద్దరి మధ్య ఏం జరిగింది.. ఎందుకని విరాకులు తీసుకున్నారు అన్న విషయం పై ఇద్దరూ ఇప్పటివరకు స్పందించలేదు.


డైవర్స్ తీసుకున్న తర్వాత ఎవరి కెరీర్లలో వాళ్ళు బిజీగా ఉన్నారు. వాళ్లు జీవితం హ్యాపీగా గడుపుతున్న కొందరు చూసి ఓర్చుకోలేక ప్రశ్నలతో సతాయిస్తున్నారు. కొంతమంది సమంతను సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంటే.. మరి కొంతమంది తప్పంతా సమంతాదే అని నాగచైతన్యను సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా సమంత ఇటువంటి సిచువేషన్ ని ఎదుర్కొంది. రీసెంట్ గా ఒక నెటిజన్ నాగచైతన్య వైపు వకాల్తా పుచ్చుకొని సమంతను అడిగిన ప్రశ్న.. దానికి ఆమె చెప్పిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


సమంత ఇంస్టాగ్రామ్ పోస్ట్ కింద.. మీ అమాయకపు భర్తను మీరు ఎందుకని మోసం చేశారు..? అంటూ ఓ నేటిజన్ ప్రశ్నించాడు. దీనికి సమంత.. ‘సారీ మీరు ఇలాంటివి చేయడం వల్ల మీకు ఎటువంటి సహాయం కలగదు.. మీకు అంతా మంచి జరగాలి అని కోరుకుంటున్నాను.. అలాగే మీరు జీవితంలో బలంగా మారాలి అని ఆశిస్తున్నాను. ఇలా ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి ఎక్కువ ఆలోచించకుండా మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి’అంటూ సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ కావడంతో సోషల్ మీడియాలో మరొకసారి ఈ ఇద్దరు డైవర్స్ గురించి చర్చలు జరుగుతున్నాయి.


సమంత ఇంత కూల్ గా రిప్లై ఇస్తుంది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. దీంతో చాలామంది సమంతను సమర్ధిస్తున్నారు.. అలా పదేపదే ఒకరి వ్యక్తిగతమైన విషయాల గురించి అడగడం మంచిది కాదు అని తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. కెరీర్ విషయానికి వస్తే అనారోగ్యం మంచి కోల్పోవడం కోసం సమంత ప్రస్తుతం సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నారు. ఒకపక్క ట్రీట్మెంట్ తీసుకుంటూ, మరోపక్క తన ఆరోగ్యం గురించి.. తనకు వచ్చిన వ్యాధి గురించి అవగాహన కల్పించే విధంగా ఓ హెల్త్ పాడ్‌కాస్ట్ ని స్టార్ట్ చేశారు.


Also Read: Govt Collapse: రేవంత్‌ జోలికి మేం వెళ్లం.. కానీ వాళ్లే ప్రభుత్వాన్ని కూల్చుకుంటారు: కిషన్‌ రెడ్డి జోష్యం


Also Read: KCR Ugadi Panchangam: కేసీఆర్‌కు మళ్లీ గెలుపు అవకాశాలు.. కేటీఆర్‌కు కొంత కష్టమే.. ఉగాది పంచాంగం ఇలా..



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter