Trolls on Anchor Rashmi యాంకర్ రష్మీ మీద గత కొన్ని రోజులుగా జరుగుతున్న ట్రోలింగ్, ఆమె నెటిజన్ల మీద విరుచుకు పడుతున్న తీరు అందరికీ తెలిసిందే. రష్మీ ఎంతగా ట్రోలింగ్‌ను ఎదుర్కొంటోన్న కూడా తాను తీసుకున్న స్టాండ్‌ను మాత్రం మార్చుకోవడం లేదు. ఈ భూమి మానవ జాతిది మాత్రమే కాదని, అన్ని ప్రాణులకు సమానంగా బతికే స్వేచ్చ, హక్కులున్నాయ్ అని చెబుతూ వస్తోంది. కానీ మనుషులు మాత్రం ఈ భూమి తమకే సొంతం అనే భ్రమలో ఉన్నారంటూ చెబుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుక్కల దాడిలో ప్రదీప్ చనిపోవడం బాధాకరమే అని చెప్పిన రష్మీ.. అలా అని కుక్కలను ద్వేషించడం, చంపడం పరిష్కారం కాదని చెప్పింది. వాటికి సరైన ఆవాసం కల్పించాలి.. పిల్లలు పుట్టకుండా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లు చేపట్టాలని అని సలహాలు ఇచ్చింది. కేవలం కుక్కల వల్లే కాదు మేకలు, ఆవుల వల్ల కూడా ప్రమాదాలు జరుగుతుంటాయని అనడంతో గో సంరక్షకులు మరింతగా రెచ్చిపోయారు. రష్మీని నెటిజన్లు ఇష్టమొచ్చినట్టుగా తిట్టేశారు.


కొందరైతే ఏకంగా యాసిడ్ పోస్తా.. చేతబడి చేస్తా.. అంటూ ఇలా నానా రకాలుగా బెదిరించారు. అలాంటి వారిపై తాను ఫిర్యాదు చేస్తానని రష్మీ కూడా వార్నింగ్ ఇచ్చింది. ఇలా రష్మీ మీద వాదనలతో గెలవలేని వారు ఆమె గతాన్ని తవ్వితీస్తున్నారు..ఇండస్ట్రీలో ఎలా పైకి వచ్చావ్.. ఎలా ఆఫర్లు సంపాదించుకున్నావ్.. ఇప్పుడేమో ఇలా పతివ్రతలా నీతులు చెబుతున్నావ్ అంటూ నానా నీచంగా కామెంట్లు చేయసాగారు.


 



అలాంటి వారిపై రష్మీ జాలి పడింది. మీ దగ్గర చెప్పడానికి సమాధానాలు లేనప్పుడే ఇలాంటివి మాట్లాడుతుంటారు అని కౌంటర్లు వేసింది. తాజాగా రష్మీ ఇలాంటి ఓ కామెంట్ మీదే స్పందించింది. ఇలానే చాలా మంది అంటున్నారు.. తానేమీ పట్టించుకోను అన్నట్టుగా కౌంటర్లు వేసింది.


రష్మీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రతీ ఒక్కరికి రిప్లై ఇస్తూ తన వాదనను వినిపిస్తోంది. అంబర్ పేట్ కుక్కల దాటి ఇష్యూ మీద స్పందిస్తోంది. కొన్ని కుక్కలు దాడి చేశాయ్ అని.. మీరంతా కలిసి కుక్కలన్నింటి మీద దాడి చేస్తుంటే.. మీకు వాటికి తేడా ఏముంది అని రష్మీ చెప్పుకొస్తోంది.


Also Read:  Anupama Parameswaran Saree pics : కొప్పున పూలెట్టుకొని.. అందమంటే అనుపమదేనా?.. చీరకట్టుకే కళ వచ్చిందా?


Also Read: Amala Akkineni : కుక్కల మీద అలాంటి కామెంట్లు చేసిందా?.. అమల నిజంగానే అలా అనేసిందా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook