Darshan world cup connection: రేణుక స్వామి అనే.. వ్యక్తి మర్డర్ కేస్ లో పూర్తిగా ఇరుక్కున్న.. కన్నడ నటుడు దర్శన్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు. అభిమానుల నుంచి సెలబ్రిటీల.. దాకా కొందరు దర్శన్ కి సపోర్ట్ చేస్తూ.. ముందుకు వస్తే మరి కొందరు మాత్రం ఆయన చేసింది చాలా దారుణం.. అంటూ విమర్శల వర్షం కనిపించారు. మరోవైపు ఈ ఏడాది టీం ఇండియా చాలాకాలం.. తర్వాత వరల్డ్ కప్ గెలిచిన సంగతి తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే నెటిజన్లు.. ఇప్పుడు దర్శన్ కి టీం ఇండియా వరల్డ్ కప్.. గెలవడానికి ఒక ఆసక్తికరమైన కనెక్షన్ ను గుర్తించారు. దర్శన్ జైలుకి వెళ్లడం.. ఇది మొదటిసారి కాదు. దర్శన్ జైలుకు వెళ్లిన ప్రతిసారి.. ఇండియా వరల్డ్ కప్ గెలుస్తూ వచ్చింది. దీంతో దర్శన్ జైల్లో.. ఉంటేనే ఇండియా గెలుస్తుంది అని చెబుతున్నారు. చాలామంది నెటిజన్లు.. ట్విట్టర్ ద్వారా దీనికి సంబంధించిన ఎన్నో మీమ్స్ షేర్ చేస్తూ దర్శన్ ని ట్రోల్ చేస్తున్నారు. 


మొదటిసారి దర్శన్ 2011లో జైలుకి వెళ్లారు. డొమెస్టిక్ వైలెన్స్ కేసులో తన సొంత భార్య విజయలక్ష్మి.. అతనిపై కేసు వేయగా దర్శన్ జైలు.. పాలయ్యారు. ఆ ఏడాది భారతదేశం భారీ విజయంతో వరల్డ్ కప్ గెలుచుకుంది. దాదాపు 30 ఏళ్ల తర్వాత.. 2011లో ఇండియా వరల్డ్ కప్ గెలుచుకుంది. క్రికెట్ అభిమానులకి అది మర్చిపోలేని సంవత్సరం. 


ఆ తర్వాత 2013లో కూడా దర్శన్.. జైలుకి వెళ్లారు. అప్పుడు కూడా టీం ఇండియా.. ఇంగ్లాండ్ కి వ్యతిరేకంగా ఆడిన ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. 


ఈ ఏడాది మళ్ళీ దర్శన్ జైల్ కి వెళ్లిన.. సంగతి తెలిసిందే. టీం ఇండియా.. ఈ ఏడాది కూడా t20 వరల్డ్ కప్ గెలుచుకుంది. దీంతో దర్శన్ జైల్లో ఉన్న.. ప్రతిసారి ఇండియా గెలుస్తుంది అంటూ.. చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. టీం ఇండియా విన్ అయినందుకు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మాలతో పాటు అందరూ దర్శన్ ని కూడా పొగడాలి అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. 


ఇక ఈసారి దర్శన్ ఒక హత్య కేసులో.. జైలుకి వెళ్లారు. తన అభిమాని రేణుక స్వామి.. తన ప్రేయసి పవిత్ర గౌడ మీద అసభ్యకరమైన కామెంట్లు చేశాడని.. పగబట్టిన దర్శన్ రేణుక స్వామిని హత్య చేశారని.. పోలీసులు ఆయన్ని కస్టడీలోకి తీసుకున్నారు. కొంతమంది కిరాయి గూండాలని.. మాట్లాడి దర్శన్ రేణుక స్వామి మీద దాడి చేసి దారుణంగా హత్య చేశారని తెలుస్తోంది.


Also Read: NTR Bharosa Scheme: జగన్‌, చంద్రబాబు అక్కడి నుంచే.. ఆ ఊరికి అంత ప్రత్యేకం ఏమిటి?


Also Read: TDP Toll Free: మీ సమస్య సీఎం చంద్రబాబుకు చెప్పాలా? అయితే ఈ నంబర్‌కు ఫోన్‌ చేయండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter