Big Boss 4: గంగవ్వ బయటికి వెళ్లడానికి కారణం అదేనా ?
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లో ( Telug Big Boss Season 4 ) ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గంగవ్వ ఇటీవలే ఆరోగ్య కారణాల వల్ల షో నుంచి అర్ధాంతరంగా బయటికి వెళ్లింది. దీంతో అటు కంటెస్టెంట్స్, ఇటు ప్రేక్షకులు కాస్త డిసపాయింట్ అయిన విషయం వాస్తవమే. కానీ ది షో మస్ట్ గో ఆన్ కదా.

Also Read | North Korea: నిండుసభలో కన్నీళ్లు పెట్టుకున్న కొరియా నియంత
అయితే ఆవిడ బయటికి ఎందుకు వచ్చింది.. దానికి అసలు కారణం ఏంటి అనే అంశంపై కొంతమంది విభిన్నమైన వాదనలు చేస్తున్నారు. వివిధ సామాజిక మాధ్యమాల్లో భిన్న కథనాలు, వార్తలు చెలామణి అవుతున్నాయి. అందులో ఒక ఇంట్రెస్టింగ్ టాక్ మీకోసం.
ఆ టాక్ ప్రకారం...
గంగవ్వకు ( Gangavva ) ఉన్న ఇమ్యూనిటీని గమనించి మిగితా కంటెస్టెంట్స్ అంతా ఆమె విషయంలో సేఫ్ గేమ్ ఆడేందుకు ప్రయత్నించారు. అవసరం ఉన్నా లేకున్నా గంగవ్వకు మద్దతు ఇవ్వడానికి ప్రయత్నించారు. గౌరవంతోనో, లేక భయంతోనో.. లేదా ఇతర మరే కారణం వల్ల అయినా చాలా మంది కంటెస్టెంట్స్ వివిధ టాస్కుల్లో గంగవ్వకు మద్దతు ఇవ్వడంతో గేమ్ వన్ సైడ్ అవడం.. తరువాత గేమ్ షో మజా తగ్గిపోయింది అని.. దాంతో మార్పు తప్పదు అని గంగవ్వను ఇలా తప్పించారు అని ఒక టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం గంగవ్వ బయటికి వచ్చాక ఇలాంటి కథనాలు ఎన్నో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఇందులో నిజం ఏంటో అనేది మాత్రం ఎవరికీ తెలియదు.
ALSO READ | UPSC Notification 2020: ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సీ
గమనిక: ఈ ఆర్టికల్ కేవలం సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని కథనాలను వర్ణించడానికి మాత్రమే రాసినది. రచయిత లేదా సంస్థ సొంత అభిప్రాయాలు కావు అని గమనించగలరు.