Gangs of Godavari Review: ఈమధ్య కంటెంట్ ఉన్న సినిమాలను తప్ప ప్రేక్షకులు మిగతా సినిమాలను చూడటానికి పెద్దగా ఆసక్తి చూపించటం లేదు. కానీ మరోవైపు చాలా వరకు సినిమాలన్నీ ఒకే ఫార్మాట్ లో వస్తున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా గ్యాంగ్స్టర్ డ్రామా అనగానే అన్నిటికీ కథ ఒకేలాగా అనిపిస్తుంది. పేర్లు, క్యారెక్టర్లు మారుతున్నాయి తప్ప దాదాపు అన్నీ కధలు ఒకేలాంటి ఫార్మేట్ లో నడుస్తూ ఉంటాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలు బ్యాక్ గ్రౌండ్ లేని ఒక హీరో ఒక పెద్ద గ్యాంగ్స్టర్ తో గొడవపడటం తో మొదలయ్యే కథ హీరో గ్యాంగ్స్టర్ గా మారి ఎదుర్కొనే ఒడిదుడుకులతో ఎండ్ అవుతుంది. ఈ మధ్యనే విడుదలైన గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమా కూడా ఈ ఫార్మాట్ లోనే నడుస్తుంది. విశ్వక్ సేన్ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా కృష్ణ చైతన్య దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా పరవాలేదు అనిపిస్తుంది కానీ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించలేకపోతోంది.


ఒక సాధారణ యువకుడైన హీరో ఎమ్మెల్యే మధ్య జరిగే గొడవ, ఆ తరువాత హీరో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి.. అందరికీ షాక్ ఇవ్వడం, తర్వాత ఎమ్మెల్యే కి ఛాలెంజ్ చేయడం.. ఇదంతా చాలా సినిమాలలో చూసిన కథ. అయితే ఈ సినిమా చూస్తున్నప్పుడు ముఖ్యంగా మోహన్ బాబు లెజెండ్ నటుడు మోహన్ బాబు నటించిన ఎం ధర్మరాజు ఎంఏ సినిమా చాలామందికి గుర్తుకు వస్తుంది. ముఖ్యంగా ఇదే విషయాన్ని సోషల్ మీడియాలోని నేటిజన్స్ ఎంతోమంది కామెంట్స్ పెడుతున్నారు.


రవి రాజా పినిశెట్టి దర్శకత్వంలో 1994లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఘన విజయాన్ని సాధించింది. అయితే ఆ సినిమాలో ఉన్న ఇంటెన్సిటీ మాత్రం గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమాలో కనిపించలేదు. చాలావరకూ సన్నివేశాలు కామెడీగా అనిపిస్తాయి. 


గామి లాంటి విభిన్న కథ తో ప్రేక్షకుల ముందుకి వచ్చిన విశ్వక్ సేన్ మళ్లీ ఇలా రొటీన్ కథల ఫార్మాట్ లో కొట్టుకుపోతాడేమోనని అభిమానులు సైతం కంగారుపడుతున్నారు. నిజానికి విశ్వక్ సేన్ కంటే ముందు ఈ సినిమాని కృష్ణ చైతన్య శర్వానంద్ కి వినిపించారు. 


కథ మొత్తం విన్న శర్వానంద్ అప్పటికే అలాంటి ఒక సినిమా చేసేసానని చెప్పి రిజెక్ట్ చేశారట. శర్వానంద్ చేసిన అలాంటి సినిమా రణరంగం. సుధీర్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఇప్పటికే ఫ్లాప్ ఎదుర్కొన్న శర్వానంద్ మళ్లీ అలాంటి కథ వద్దని నో చెప్పేసారు. కానీ విశ్వక్ సేన్ మాత్రం ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతవరకు నెట్టుకు రాగలరో చూడాలి..


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి