New Movie Releases: ఆడవాళ్లు మీకు జోహార్లు, సెబాస్టియన్.. ఈ వారం రిలీజయ్యే సినిమాలు!
New Movie Releases: కరోనా కేసులు క్రమంగా తగ్గడం వల్ల పలు రాష్ట్రాల్లోని థియేటర్లు తెరుచుకుంటున్నాయి. ఈ క్రమంలో గత వారం విడుదలైన `భీమ్లా నాయక్` బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అయితే ఈ వారం యువ కథానాయకులు సందడి చేయనున్నారు. ఈ వారం టాలీవుడ్ లో థియేటర్, ఓటీటీల్లో విడుదల కానున్న సినిమాలేవో తెలుసుకుందాం.
New Movie Releases: గతవారం 'భీమ్లా నాయక్' చిత్రం విడుదల తర్వాత బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇప్పుడదే జోష్ ను కొనసాగించేందుకు కొంతమంది యంగ్ హీరోలు థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ వారం థియేటర్, ఓటీటీలలో విడుదల కానున్న చిత్రాలేవో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆడవాళ్లు మీకు జోహార్లు
శర్వానంద్, రష్మిక హీరోహీరోయిన్లుగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. ఈ చిత్రంలో ఖుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుధాకర్ చెరూకూరి నిర్మాతగా వ్యవహరించారు. దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 4న థియేటర్లలో విడుదల కానుంది.
సెబాస్టియన్ పీసీ 524
'రాజావారు రాణిగారు', 'ఎస్. ఆర్. కల్యాణ మండపం' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో నటించిన మూడో చిత్రం 'సెబాస్టియన్ పీసీ 524'. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది. రేచీకటితో బాధపడే ఓ పోలీస్ కానిస్టేబుల్ నైట్ డ్యూటీ చేస్తే ఎలా ఉంటుందనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. జిబ్రాన్ సంగీతాన్ని అందించారు. మార్చి 4న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
ఓటీటీల్లో విడుదల కానున్న సినిమాలు..
DJ టిల్లు
సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటించిన 'DJ టిల్లు' చిత్రం ఇటీవలే థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడీ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమైంది. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 4న 'ఆహా' ఓటీటీలో చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
సామాన్యుడు
విశాల్, డింపుల్ హయాతి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'సామాన్యుడు'. శరవణన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవలే థియేటర్లలో విడుదల మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఇప్పుడీ చిత్రాన్ని జీ5 వేదికగా మార్చి 4న స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Also Read: Aadavallu Meeku Joharlu: ఆడవాళ్లు మీకు జోహార్లు ట్రైలర్ రిలీజ్.. ఆద్యంతం నవ్వులే..
ALso Read: Bheemla Nayak Success Party: భీమ్లా నాయక్ టీమ్‌కి పవన్ సక్సెస్ పార్టీ.. వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook