Miss Universe 2023 Winner: ఈ ఏడాది మిస్ యూనివర్స్ కిరీటాన్ని(Miss Universe 2023) నికరాగ్వాకు చెందిన అందాల భామ షెన్నిస్ పలాసియోస్(Sheynnis Palacios) దక్కించుకుంది. ఎల్ సాల్వడార్‌లోని జోస్ అడాల్ఫో పినెడా అరేనాలో జరిగిన 72వ మిస్ యూనివర్స్ పోటీల్లో ఆమె విజేతగా నిలిచింది. మాజీ విశ్వ సుందరి ఆర్‌ బానీ గాబ్రియేల్‌ (RBonney Gabriel) చేతుల మీదుగా ఆమె ఈ కిరీటాన్ని అందుకుంది. దీంతో ఈ విశ్వ సుందరికి నెటిజన్లు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ పోటీల్లో మనదేశం తరపున పోటీపడిన శ్వేతా శారదా సెమీస్‌లో టాప్-20కు అర్హత సాధించినప్పటికీ టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయింది. శ్వేతా శారదా చండీగఢ్‌కు చెందిన యువతి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిస్ యూనివర్స్ 2023 పోటీల్లో దాదాపు 84 దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడ్డారు. వీరంతా వ్యక్తిగత ప్రకటనలు, ఇంటర్వ్యూలు, ఈవెనింగ్ గౌన్లు, ఈత దుస్తులలో ప్రదర్శనలు ఇచ్చారు. ఈ ఫైనల్ పోటీకి జెన్నీ మే జెంకిన్స్, మరియా మెనౌనోస్, మాజీ మిస్ యూనివర్స్ ఒలివియా కల్పో హోస్టులుగా వ్యవహరించారు. అయితే ఈ పోటీలో నికరాగ్వా, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్‌లకు చెందిన భామలు వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. ఈ అందాల పోటీలో థాయిలాండ్‌కు చెందిన ఆంటోనియా పోర్సిల్డ్ మొదటి రన్నరప్‌గా, ఆస్ట్రేలియాకు చెందిన మోరయా విల్సన్ రెండో రన్నరప్‌గా నిలిచారు. ఈ సంవత్సరం పాకిస్తాన్ కూడా మొదటిసారి మిస్ యూనివర్స్‌లో అరంగేట్రం చేసింది. దాదాపు 13వేల మంది ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. 


Also Read: IND Vs AUS Live Updates: మరికొన్ని గంటల్లో ఫైనల్ ఫైట్.. విశ్వకప్‌కు ఒక్క అడుగు దూరంలో భారత్  


Also Read: వరుణ్‌ తేజ్‌తో పెళ్లిపై తొలిసారి స్పందించిన లావణ్య.. అబ్బో భర్తపై ఎంతో ప్రేమో..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి