Niharika : బావ.. నీ కోసం చూశా.. అద్భుతంగా ఉంది.. విరూపాక్షపై నిహారిక కామెంట్స్
Niharika Konidela About Virupaksha నిహారిక కొణిదెల తాజాగా విరూపాక్ష సినిమాను వీక్షించినట్టు పేర్కొంది. సాయి ధరమ్ తేజ్ అదరగొట్టేశాడని, తన బావ కోసమే ఈ సినిమాను చూశానని నిహారిక తెలిపింది. ఇక ఈ సినిమాను ఎంతో ఇంట్రెస్టింగ్గా చూశానని చెప్పుకొచ్చింది.
Niharika Konidela About Virupaksha మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో రూపొందిన విరూపాక్ష సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ దక్కడంతో పాటు మంచి కలెక్షన్స్ నమోదు అవుతున్నాయి. సాయి ధరమ్ తేజ్ చాలా కాలం తర్వాత ఒక భారీ కమర్షియల్ సక్సెస్ ను విరూపాక్ష చిత్రంతో దక్కించుకోబోతున్నాడు అంటూ మొదటి రోజు కలెక్షన్స్ ను చూస్తుంటే అనిపిస్తుందని మెగా ఫ్యాన్స్ తో పాటు బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
విరూపాక్షకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో మెగా ఫ్యామిలీ మెంబర్స్ స్పందిస్తున్నారు. చిరంజీవి స్పందిస్తూ యాక్సిడెంట్ తర్వాత నీకు ఇలాంటి ఒక సూపర్ హిట్ దక్కడం ఆనందంగా ఉందని ట్వీట్ చేశాడు. తాజాగా మెగా డాటర్ నిహారిక కొణిదెల కూడా స్పందించింది. ఈ హర్రర్ మూవీని కేవలం నీకోసమే చూశాను బావ... అంటూ సోషల్ మీడియా ద్వారా ఆసక్తికర పోస్ట్ ను చేసింది. నిహారిక తన పోస్ట్ లో.. 'దర్శకుడు, నటీ నటులు, మ్యూజిక్, మేకప్ మరియు ఆర్ట్ వర్క్ సినిమాకు హైలైట్. నేను విరూపాక్ష చిత్రాన్ని ఉపిరి బిగపట్టుకుని చూశాను. మీరు కూడా థియేటర్ కు వెళ్లి ఈ సినిమాను చూడండి. నాలాగే మీరు కూడా మాట్లాడుతారు. చిత్ర యూనిట్ సభ్యులందరికి కూడా కంగ్రాట్స్' అంటూ పేర్కొంది.
[[{"fid":"270381","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
నిహారిక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మెగా హీరోల సినిమాల గురించి నిహారిక పోస్ట్‌లు పెడుతుందన్న సంగతి తెలిసిందే. ఈ మధ్య మిగతా హీరోల సినిమాలు చూసి కూడా రివ్యూలు ఇస్తోంది. నిహారిక ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ సినిమా విరూపాక్ష గురించి నిహారిక షేర్ చేయడంతో ఎంతగా ఈ సినిమా ఆమెకు నచ్చిందో అర్థం చేసుకోవచ్చు.
Also Read: Malli Pelli Teaser : మళ్లీ పెళ్లి టీజర్.. నరేష్-రమ్య రఘుపతి-పవిత్రల కథే సినిమానా?.. హోటల్ సీన్ కేక
ఇక విరూపాక్ష సినిమాలో సాయి ధరమ్ తేజ్ కు జోడీగా సంయుక్త మీనన్ నటించిన విషయం తెల్సిందే. ఈ సినిమా చేతబడి కాన్సెప్ట్ తో రూపొందింది. తెలుగు లో ఒప్పుడు వచ్చిన సూపర్ హిట్ చిత్రాలు అన్వేషణ.. తులసీదళం.. కాష్మోరా సినిమాల స్థాయిలో ఉంటుందని మేకర్స్ చెప్పుకొచ్చారు. అన్నట్లుగానే విరూపాక్ష ఆ స్థాయిలో ఆధరణ దక్కించుకుంటుందని.. మొదటి వారం పూర్తి అయ్యేప్పటికి సినిమా కచ్చితంగా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి.
Also Read: Asha Negi Photos : బెడ్డుపై నగ్నంగా బుల్లితెర నటి.. ఆశలు రేపేలా ఆశా నేగి పోజులు.. పిక్స్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook