Niharika Konidela Wears Bikini : మెగా డాటర్‌గా నిహారికకు సోషల్ మీడియాలో ఓ ఇమేజ్ ఉంటుంది. నిహారిక సినిమాల విషయంలోనూ మెగా అభిమానులు కొన్ని హద్దులు పెట్టారు. అలాంటి పాత్రలు వద్దు.. అలాంటి డ్రెస్సులు వద్దంటూ అభిమానులు వారించారు. ఇక నిహారిక సైతం హోమ్లీ పాత్రలే వేసింది. ఎక్స్ పోజింగ్ పాత్రలు, డ్రెస్సులకు దూరంగా ఉంది. అయితే నిహారిక సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టేశాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలా నిహారిక సినీ కెరీర్ బాగా లేకపోయినా.. ఓటీటీలో మాత్రం సక్సెస్ అయింది. ఇక నిహారిక పెళ్లి తరువాత పూర్తిగా ఓటీటీలపైనే దృష్టి పెట్టింది. నటిస్తూ నిర్మిస్తూ ఫుల్ బిజీగా మారింది. ఓ చిన్న ఫ్యామిలీ స్టోరీ సూపర్ హిట్ అయింది. హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ ఓ మోస్తరుగా నడిచింది. అయితే నిహారిక ఆశించిన విజయం మాత్రం దక్కలేదనిపిస్తోంది.


ఇప్పుడు నిహారిక తన భర్తతో కలిసి వెకేషన్లో ఎంజాయ్ చేస్తోంది. అసలే నిహారికకు వెకేషన్లలో ఉండటం అంటే మహా ఇష్టం. గోవా, పాండిచ్చెరి, మాల్దీవులు అంటూ ఇలా తిరుగుతూనే ఉంటుంది. అయితే నిహారిక ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురించింది. ఇంత వరకు ఇలా ఎప్పుడూ కూడా కనిపించలేదు నిహారిక. పొట్టిబట్టల్లో నిహారిక ఆ మధ్య కొన్ని సార్లు కనిపించింది.


కానీ బికినీ మాత్రం ఎప్పుడూ ధరించలేదు. నిహారిక బికినీకి దూరంగా ఉంటూ వచ్చింది. కానీ ఇలా మొదటి సారిగా బికినీలో కనిపించింది నిహారిక. ప్రస్తుతం ఉన్న వెకేషన్లో సర్ఫింగ్, స్కూబా డైవింగ్ వంటివి చేసినట్టు కనిపిస్తోంది. అలా సముద్రంలో ఎంజాయ్ చేస్తోన్న నిహారిక ఇలా బికినీలో కనిపించి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ప్రస్తుతం నిహారిక బికినీ ఫోటోలు మాత్రం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.


Also Read : Adipurush case : ఆదిపురుష్‌కు దెబ్బ మీద దెబ్బ


Also Read : Galata Geetu : భయంకరమైన అతి.. గీతూ ఓవర్ యాక్షన్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook