Spy Movie Ott streaming date: హీరో నిఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ 'స్పై'. జూన్ 29న వరల్డ్ వైడ్ గా రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో  ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. గూఢచారి, క్షణం, ఎవరు, హిట్: ది ఫస్ట్ కేస్ వంటి సస్పెన్స్ థ్రిల్లర్, క్రైమ్ సినిమాలకు ఎడిటర్‌గా పనిచేసిన గ్యారీ బిహెచ్ తొలిసారి ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ సినిమాలో రానా ద‌గ్గుబాటి అతిథి పాత్రలో కనిపించాడు. నిఖిల్ కెరీర్ లో హాయ్యస్ట్ ఓపెనింగ్స్ ఈ సినిమాకే వచ్చాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

థియేటర్లలో ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు రెడీ అయింది. ఈ సినిమా డిజటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ  అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ నెల 29 నుంచి  అమెజాన్ ప్రైమ్ లో 'స్పై' స్ట్రీమింగ్ కానుందని టాక్ వినిపిస్తోంది. 


విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో నిఖిల్ కూడా ఒకరు. హ్యాపీడేస్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన నిఖిల్.. యువత, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కార్తికేయ, కార్తికేయ 2, 18 పేజీస్ వంటి చిత్రాలతో యూత్ లో మాంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.  డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు. 'స్పై' తర్వాత నిఖిల్ 'స్వయంభు', 'ది ఇండియన్ హౌస్' వంటి భారీ ప్రాజెక్ట్స్ లో నటించనున్నాడు. వీటితోపాటు రీసెంట్ గా సుధీర్ వర్మ దర్శకత్వంలోను ఓ సినిమాకు ఓకే చెప్పాడు. దీని తర్వాత 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సీక్వెల్ చేసే అవకాశముందని తెలుస్తోంది. 


Also Read: OTT Movies: ఓటీటీ ప్రేమికులకు గుడ్‌న్యూస్, రేపు ఒక్కరోజే 19 సినిమాల స్ట్రీమింగ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook