Nikhil's Karthikeya 2 movie hits theatres on July 22: కెరీర్ ఆరంభం నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుస విజయాలు అందుకుంటున్నహీరో నిఖిల్ సిద్దార్థ్. హ్యాపీ డేస్, యువత, స్వామి రారా, కేశవ, సూర్య vs సూర్య, అర్జున్ సురవరం, కార్తికేయ, ఎక్కడికిపోతావ్ చిన్నవాడా వంటి సినిమాలతో నిఖిల్ తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నిఖిల్ కెరీర్‌లో ఘన విజయం సాధించిన చిత్రాల్లో 'కార్తికేయ' ఒకటి. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత డైరెక్టర్ చందు మొండేటి, హీరో నిఖిల్ కలిసి దానికి సీక్వెల్‌గా 'కార్తికేయ 2' సినిమాను తెరకెక్కిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కార్తికేయ 2 అనౌన్స్ మెంట్ పోస్టర్‌తోనే మేకర్స్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతోంది. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభోట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే నేడు నిర్మాత అభిషేక్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా కార్తికేయ 2 సినిమా విడుదల తేదీని ప్రకటించారు. 2022 జూలై 22న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు వస్తుందని ట్విట్టర్ వేదికగా చిత్ర యూనిట్, హీరో నిఖిల్ చెప్పారు. 


స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న కార్తికేయ 2 మూవీలో అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శ్రీనివాస‌ రెడ్డి, ప్ర‌వీణ్‌, ఆదిత్య మీన‌న్‌, తుల‌సి, స‌త్య, వైవా హ‌ర్ష‌, వెంక‌ట్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీకృష్ణుడు నివసించిన ద్వారక, ద్వాపర యుగాలకు ఈ చిత్రంతో సంబంధం ఉందని పోస్టర్ బట్టి తెలుస్తోంది. మరి డాక్టర్ కార్తికేయ.. శ్రీ కృష్ణుడి చరిత్రకు సంబంధించిన ఏ అంశాలను వెలుగులోకి తెస్తాడో చూడాలి మరి. 



భారీ బడ్జెట్ పెట్టి అత్యున్నత సాంకేతిక హంగులతో కార్తికేయ 2 సినిమాని తెరకెక్కిస్తున్నారని సమాచారం తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఇప్పటికే అద్భుతమైన ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందంటే.. ఈ సినిమాపై హైప్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులను ప్రముఖ మీడియా గ్రూప్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. కాలభైరవ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


Also Read: Dipika Pallikal: రెండు టైటిల్స్‌ గెలిచాం.. ఇప్పటికైనా టాప్స్‌లో చేర్చాలని కోరుకుంటున్నాం: దీపిక


Also Read: Walking Benefits: భోజనం చేసిన తర్వాత.. నడవడం వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook