Nikhil Siddharth SPY Movie Twitter Talk:  కార్తికేయ-2 మూవీతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో నిఖిల్ సిద్ధార్థ్‌. మరోసారి డిఫరెంట్ స్టోరీతో ఆడియన్స్‌ను అలరించేందుకు స్పై మూవీతో రెడీ అయ్యాడు. గ్యారీ బీహెచ్ డైరెక్షన్‌లో రూపొందించిన ఈ సినిమాను ఈడీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రాజేశేఖర్ రెడ్డి కె నిర్మించారు. నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఆధారంగా తెరకెక్కిన స్పై నేడు ఆడియన్స్ ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్‌ చేసిన టీజర్, ట్రైలర్‌తో సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. సినిమా విడుదల సందర్భంగా చిత్రయూనిట్‌కు ఆల్‌ద బెస్ట్ చెబుతూ ట్వీట్స్ చేస్తున్నారు. యూఎస్ ప్రీమియర్‌లో ఇప్పటికే షోలు వేశారు. ట్వీట్టర్‌లో టాక్ ఎలా ఉందో చూద్దాం..



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


 



"యూఎస్‌ఏ ప్రీమియర్ బాక్సాఫీస్ విజేత నుంచి స్పై మూవీకి మంచి పాజిటివ్ టాక్‌ను అందుకుంది. హీరో నిఖిల్‌, చిత్ర బృందానికి అభినందనలు. 3 వరుస హిట్స్‌తో రచ్చ చేస్తున్న నిఖిల్ సిద్ధార్థ్.." అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ మూవీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాపై ఉన్న అంచనాలను క్రాస్ చేసింది.. ముఖ్యంగా నిఖిల్ నటన చాలా బాగుంది.. అందరూ వెళ్లి ఈ సినిమా చూడండి.. అని రివ్యూ ఇస్తున్నారు.



 




 




 





స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook