Nithya Menon: నటన పరంగా మనకున్న అద్భుతమైన హీరోయిన్స్ లో నిత్య మీనన్ ఒకరు. ఏ పాత్రనైనా అవలీలగా చేసేయగలగదు నిత్య. ఈ కేరళ బ్యూటీ తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చింది‌. కాగా తన హైట్ కారణము మరేదో కారణమో తెలియదు కానీ.. నిత్యామీనన్ కి తెలుగులో మాత్రం అవకాశాలు తన టాలెంట్ కి తగినన్ని రాలేదని చెప్పాలి.‌ ఇక సినిమాలు పక్కన పెట్టి ప్రస్తుతం ఈ స్టార్ హీరోయిన్ వెబ్ సిరీస్ లో కనిపించి మెప్పిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక తాజాగా నిత్య మీనన్ చేసి ఓటీటిలో విడుదలైన సినిమా శ్రీమతి కుమారి.  ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను సాధించింది.


ఇక ఈ కథ మధ్య వయసు వచ్చిన ఒక అమ్మాయి తన కళ నెరవేర్చుకోవడం కోసం పెళ్ళికి దూరం ఉండడం అనే పాయింట్ చుట్టూ తిరుగుతుంది. కాగా ఈ వెబ్ మూవీ మంచి సక్సెస్ సాధించడంతో, సినిమా యూనిట్ ఈ మధ్యనే సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇక ఈ సక్సెస్ మీట్ సందర్భంగా నిత్యామీనన్ తనను ఒకరు మాత్రం టార్చర్ పెడుతారు అంటూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఇంతకీ మన నిత్య మీనన్ ని అంతలా టార్చర్ పెట్టేది మరెవరో కాదంట నిత్యామీనన్ భామ్మే. అసలు విషయానికి వస్తే ఈ సినిమా సక్సెస్ మీట్ లో నిత్యామీనన్ తన పెళ్లి గురించి మాట్లాడుతూ తన పేరెంట్స్ తనకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారని, తన పెళ్లి విషయంలో కూడా ఎప్పుడూ వారు ఒత్తిడి తీసుకురాకుండా చాలా సపోర్టివ్ గా ఉన్నారని చెప్పుకొచ్చింది.


అంతేకాదు తనకు తన ఇంట్లో కాని.. బయట కానీ తనపై ప్రెజర్ తెచ్చేవారు ఎవరూ లేరని చెప్పింది. అయితే ఆ తరువాత మాట్లాడుతూ.. తన భామ్మ మాత్రం తనను అస్సలు హీరోయిన్ గా చూడదని .. తనకు వాల్యూ ఇవ్వకుండా మాటలతో టార్చర్ పెట్టేదన్నారు నిత్య. సూటి పోటి మాటలతో ఎప్పుడు ఇబ్బంది పెట్టేదట. అంతేకాదు నిత్యామీనన్ కనిపిస్తే చాలు ఇంత వయసు వచ్చింది ఎప్పుడు పెళ్లి చేసుకుంటావంటూ వేధించుకుని తినేదట నిత్య భామ్మ. కనీసం తననో నటిగా కూడా గుర్తించేది కాదని ఎన్ని రోజులు ఇలా ఉంటావ్.. త్వరగా పెళ్లి చేసుకోవచ్చు కదా.. అంటూ .. మాటలతో ఇబ్బంది పెట్టేది అని.. తన భామ్మ అని మాటలు అన్ని చెప్పుకొచ్చింది ఈ హీరోయిన్.


Also Read: Karampudi Man Death News: కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన.. భార్య బిడ్డకు జన్మనిచ్చిన ఆసుపత్రికే భర్త మృతదేహం


Also Read: Namo Bharat: నమో భారత్ రైలు వేగం, టికెట్ రేట్లు ఎంత..? ఏయే సౌకర్యాలు ఉంటాయి..?  



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.