Elimination in Bigg Boss 6: ఎలిమినేషన్స్ చివరి నిముషంలో ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్
No Elimination in Bigg Boss 6 Telugu First Week: ఈ వారం నామినేషన్స్ చివరి నిముషంలో బిగ్ బాస్ యాజమాన్యం ట్విస్ట్ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే
No Elimination in Bigg Boss 6 Telugu First Week: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఆసక్తికరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 4వ తేదీ అంటే శనివారం నాడు ప్రారంభమైన ఈ షో మొదటి వారం చివరికి చేరింది. శనివారం నాడు నాగార్జున హౌస్ లోపలికి ఎంట్రీ ఇచ్చి అందరితో వారం మొత్తం జరిగిన విశేషాల గురించి చర్చించడమే కాక ఎలిమినేషన్ ప్రక్రియకు సంబంధించి కూడా ఒకరిని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. ఈ వారం మొత్తం ఏడుగురు హౌస్ మేట్స్ ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యారు.
ఆ ఏరుగురిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఈ వారం ఎలిమినేషన్ కోసం ఏడుగురు సభ్యులు నామినేట్ అవ్వగా వారిలో ఇనయా సుల్తానా, అభినయశ్రీ, ఫైమా, శ్రీ సత్య, ఆరోహి రావు, చలాకీ చంటి, సింగర్ రేవంత్ ఉన్నారు. ఇక నిన్న అర్ధరాత్రితో మొదటి వారం బిగ్ బాస్ ఓటింగ్ ముగిసింది. ఈ ఏడుగురిలో మొదటి వారంలో ఒకరు బయటకు రాబోతున్నారని, వారిలో ఇనయా సుల్తానా కానీ ఆరోహి రావు కానీ అభినయశ్రీ కానీ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది.
మధ్యాహ్నం లీకైన సమాచారం మేరకు అభినయశ్రీ అందరికంటే తక్కువ ఓట్లు దక్కించుకోవడంతో ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరిగింది, కానీ తాజాగా అందుతున్న సమాచారం మేరకు కేవలం మూడు రోజుల గేమ్ చూసిన తర్వాత ఎలిమినేట్ చేయడం కరెక్ట్ కాదు అని భావించి బిగ్ బాస్ యాజమాన్యం మొదటి వారం ఎలిమినేషన్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించినట్లు తెలుస్తోంది. చివరి వరకు అభినయశ్రీ, ఇనయా సుల్తానా నిలవగా చివరిలో ఇద్దరూ సేవ్ అయినట్టు నాగ్ ప్రకటించారని తెలుస్తోంది.
ఇక శనివారం నాడే శని ఆదివారాలకు సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. నాగార్జున శనివారం ఒక్కరోజు మాత్రమే బిగ్ బాస్ సెట్ కి వస్తారు ఆ రోజే రెండు రోజులకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేస్తుంది బిగ్ బాస్ యాజమాన్యం. ఇక బిగ్ బాస్ లీక్స్ ప్రకారం మొదటి వారం ఎవరూ ఎలిమినేట్ కాలేదని తెలుస్తోంది. అయితే నాగార్జున బిగ్ బాస్ రివ్యూయర్స్ అయిన గీతూ, ఆదిరెడ్డి మీద ఫైర్ అయ్యారు. లోపల కూడా రివ్యూయర్స్ లాగానే ప్రవర్తిస్తున్నారని ఆయన కాస్త ఘాటుగానే వారి మీద అక్షింతలు వేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి వారిద్దరు ఈ విషయం మీద ఎలా తీసుకుని తమ గేమ్ స్ట్రాటజీ మార్చుకుంటారు అనేది చూడాల్సి ఉంది.
Also Read: Vijay Devarakonda in SIIMA: లైగర్ డిజాస్టర్ తరువాత పబ్లిక్ ఈవెంట్లో కనిపించనున్న విజయ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి