Nookaraju Tries to Tie Knot Asia: పటాస్ నూకరాజు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినీ పరిశ్రమలో ఎలా అయినా మెరవాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం కాదనుకుని హైదరాబాద్ వచ్చి మూటలు మోసి మరి కష్టపడ్డాడు. చివరికి పటాస్ ద్వారా ఒక మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకుని తర్వాత జబర్దస్త్ కి షిఫ్ట్ అయ్యి అనేక కామెడీ స్కిట్లు చేస్తూ మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే జబర్దస్త్ లోకి వచ్చాక లవ్ ట్రాక్లు పెట్టడం అనేది కామన్ అయిపోయింది కదా. ఈయనకి కూడా ఆసియా అనే ఒక అమ్మాయితో లవ్ ట్రాక్ నడిపిస్తున్నారు జబర్దస్త్ నిర్వాహకులు. నిజంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారో లేక జబర్దస్త్ కోసమే ప్రేమించుకుంటున్నారో తెలియదు కానీ ఇప్పుడు క్యాష్ షో లో ఒక ఆసక్తికర అంశం చోటు చేసుకుంది. తాజాగా క్యాష్ షో ప్రోమో విడుదల చేశారు ఈ షో లో ఆసియా- నూకరాజు,  షబీనా-పరదేశి,  కార్తీక్,  ప్రవీణ్-ఫైమా పై వంటి వారు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా నీది ఆసియాది నిజమైన ప్రేమ అయితే కర్పూరం చేతిలో పెట్టుకుని వెలిగించుకో అని సుమ చెబితే నిజంగా నూకరాజు కర్పూరం చేతిలో వెలిగించుకున్నాడు. చెయ్యి కాలుతున్నా,  మంట పెడుతున్నా సరే దాన్ని పంటి బిగువున నొక్కిపెట్టి ఆసియాపై ఎంత ప్రేమ ఉందో నిరూపించుకునే ప్రయత్నం చేశారు. అదే సమయంలో మా అందరి సాక్షిగా ఆమెకు తాళి కట్టమని సుమ చెబితే దాన్ని కూడా మనోడు సీరియస్ గానే తీసుకుని మరో ఆలోచన లేకుండా ఆసియా మెడలో తాళికట్టేందుకు ప్రయత్నించాడు. అయితే అక్కడితో ప్రోమో కట్ చేశారు. కచ్చితంగా ఇది టిఆర్పి కోసమే ప్లాన్ చేశారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం నూకరాజుది నిజమైన ప్రేమని అందుకే దేనికైనా సిద్ధం అయ్యాడని కామెంట్ చేస్తున్నారు.



Also Read: Commitment Movie: వివాదంలో కమిట్మెంట్ మూవీ.. కేసు నమోదు..ధ్వంసం చేస్తామంటూ హెచ్చరిక!


Also Read:  Rajkummar Rao: ఇల్లమ్మేసిన జాన్వీ కపూర్… కోట్లు కుమ్మరించి కొన్న స్టార్ హీరో.. లాభం ఎంతో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook