Nora Fatehi kills with her moves in Satyameva Jayate 2 new song Kusu Kusu Watch here: నోరా ఫతేహీ పేరు ఇప్పుడు అంతటా మారుమోగిపోతూ ఉంది. ఈ పేరు విం​‍​టే మొదట అందరికీ గుర్తు వచ‍్చేది దిల్‌బర్‌ (dilbar) పాట. ఆ సాంగ్‌లో అదరగొట్టేసింది నోరా ఫతేహీ. యూత్‌ను అట్రాక్ట్ చేసేసింది. ఇప్పుడు మళ్లీ కుర్రకారు మదిని దోచుకునేందుకు కొత్త పాటతో వస్తోంది ఈ డ్యాన్స్ బ్యూటీ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాలీవుడ్‌ హీరో జాన్‌ అబ్రహమ్‌ (John Abraham) తాజా చిత్రం సత్యమేవ జయతే 2 లో (atyameva Jayate 2).. కుసు కుసు పాట (Kusu Kusu Song) ఇవాళ విడుదలైంది. ఈ పాటలో నోరా తన కిల్లింగ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో చంపేసింది. బెల్లీ డ్యాన్స్‌తో (Belly dance‌) మతి పోగొట్టేసింది. 


జారా ఎస్‌ ఖాన్‌, దేవ్‌ నేగీలు పాడిన కుసు కుసు పాటకు తనిష్క్‌ బగ్చీ లిరిక్స్‌ రాశారు. తెలుగులోనూ నోరా ఫతేహికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. టెంపర్, కిక్ 2, లోఫర్, ఊపిరి వంటి మూవీలో స్పెషల్ సాంగ్స్‏లో నటించింది ఈ ముద్దుగుమ్మ. అలాగే బాహుబలి (Bahubali) సినిమాలోనూ మనోహరి పాటతో అందరినీ ఆకట్టుకుంది.



Also Read : Woman Kills Husband : ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించిన భార్య


సత్యమేవ జయతే 2 (Satyameva Jayate 2) మూవీ షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ మూవీ నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ సినిమా (Cinema) ప్రమోషన్స్ వేగవంతం చేసింది మూవీ యూనిట్. 2018లో వచ్చిన సత్యమేవ జయతే భారీ సక్సెస్ తర్వాత జాన్‌ అబ్రహమ్‌తో ఆ మూవీ సీక్వెల్‌ తీశారు. మిలాప్‌ జవేరీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో (Movie) రాజీవ్‌ పిల్లయ్‌, అనూప్‌ సోనీ, సాహిల్‌ వాయిద్‌ నటిస్తున్నారు.


Also Read : Anasuya Bharadwaj: పుష్పలో అనసూయ లుక్ మామూలుగా లేదుగా..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook