Tiger Nageswara Rao:


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత కొంతకాలంగా మాస్ మహారాజా రవితేజ టైం ఏ మాత్రం బాగోవడం లేదు. ఒక్క హిట్ సినిమా చేస్తే వరుసగా మూడు నాలుగు ఫ్లాప్ సినిమాలు రవితేజను వెంటాడుతున్నాయి. 2021 లో విడుదలైన క్రాక్ సినిమా తర్వాత రవితేజ కరియర్ లో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ రాలేదు. ఇక ఇప్పుడు రవితేజ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.


దసరా సందర్భంగా ఇప్పటికే బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి మరియు దళపతి విజయ్ హీరోగా నటించిన లియో బాక్సాఫీస్ వద్ద విడుదలై మంచి విజయాన్ని సాధించాయి. రెండు సినిమాలు మంచి టాక్ తో బాగానే ముందుకు దూసుకుపోతున్నాయి. ఒకవైపు ఈ రెండు సినిమాల మధ్యనే భారీ పోరు జరుగుతూ ఉన్న సమయంలో రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా ఈ రేసులో చేరింది. 


రవితేజ కెరియర్ లో మొదటి పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహించారు. స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా విడుదలైన ఈ సినిమా కి సంబంధించిన పాటలు కూడా బాగానే ఆకట్టుకున్నాయి. సినిమాలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య మరియు ఒకప్పటి హీరోయిన్ అయినా రేణు దేశాయి కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమా లో రేణు దేశాయ్ హేమలత లవణం అనే పాత్రలో నటించారు. ఆమె పాత్ర సినిమాకి హైలైట్ గా నిలిచింది అని సమాచారం. కానీ నిజానికి ఆ పాత్ర కోసం డైరెక్టర్ ముందుగా రేణు దేశాయి ని అనుకోలేదట. ఏ పాత్రని అయినా అవలీలగా చేసి ఆకట్టుకునే రమ్యకృష్ణ ని ఈ పాత్ర కోసం ముందుగా సంప్రదించారట .


కానీ రమ్యకృష్ణ ఈ కథ కాంట్రవర్షియల్ గా మారుతుంది అని అనుకుని సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. రమ్యకృష్ణ సినిమాకి నో చెప్పిన తరువాతే దర్శక నిర్మాతలు రేణు దేశాయిని సంప్రదించగా ఆమె వెంటనే ఓకే చేశారట. అలా రమ్యకృష్ణ చేయాల్సిన పాత్ర ఇప్పుడు రేణు దేశాయి చేతుల్లో పడింది. మరి చాలా కాలం ఇండస్ట్రీకి ముఖ్యంగా కెమెరాకి దూరంగా ఉన్న రేణు దేశాయ్ ఎంతవరకు బాగా నటించి ప్రేక్షకులను అలరించారో వేచి చూడాలి.


Also Read: CM Jagan: ఏపీలో అర్చకులకు శుభవార్త.. సీఎం జగన్ దసరా గిఫ్ట్  


Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.