NTR 30 Shoot to begin in the last week of October: ఒకరకంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి టెన్షన్ గా ఉన్నారు. చివరిగా ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయాల్సి ఉంది. అయితే అనూహ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో మూవీ వాయిదా పడింది. అసలు ఆ సినిమా ఉంటుందో లేదో తెలియని పరిస్థితి త్రివిక్రంతో సినిమా ఉంటుందని ఆ మధ్య నాగవంశీ ప్రకటించారు కూడా.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించగా కొరటాల శివ తాను జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నానని ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో 30వ సినిమాగా రూపొందబోతున్న ఈ సినిమా గురించి ఇప్పటికే రకరకాల ప్రచారాలు తెరమీదకు వచ్చాయి. అయితే కొరటాల శివ ఆచార్య ఎఫెక్ట్ తో ఈ సినిమా కథ మారుస్తున్నారని, అందుకే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది.


ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ నెల చివరి వారం నుంచి ప్రారంభం కాబోతోంది అని తెలుస్తోంది. అప్పటివరకు కూడా ఎన్టీఆర్ ఫుల్ గా బాడీ మీద శ్రద్ధ పెట్టినట్లు చెబుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం కాస్త బాడీ పెంచి కండలు తిరిగిన దేహంతో కనిపించిన ఎన్టీఆర్ ఇప్పుడు కాస్త బక్క చిక్కే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కొరటాల శివ సబ్జెక్టుకి తగినట్లుగా ఎన్టీఆర్ తన లుక్ మార్చుకునే పనిలో ఉన్నారని తెలుస్తోంది.


ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటిస్తున్నారు అనే విషయం మీద క్లారిటీ లేదు. అయినా సరే రకరకాల పేర్లు అయితే పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చాయి. కానీ ఎవరు నటిస్తున్నారు అనే విషయం మీద అధికారికంగా క్లారిటీ లేదు. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ యువ సుధా బ్యానర్ల మీద మిక్కిలినేని సుధాకర్ అలాగే కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఒక బడా సంస్థ ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.