NTR 31 Movie Poster: యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఆయన ఫ్యాన్స్ కు వరుస సర్ ప్రైజ్ లు వస్తున్నాయి. గురువారం కొరటాల శివతో సంబంధించిన మూవీ అప్డేట్ రాగా.. ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో తెరకెక్కించనున్న మూవీ అప్డేట్ కూడా వచ్చేసింది. అందుకు సంబంధించిన పోస్టర్ లో తారక్ ఉగ్రరూపంలో కనిపించారు. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించే మూవీలో యాక్ట్ చేసే హీరోలకు ప్రత్యేకంగా ఉండేలా ఆయన జాగ్రత్త వహిస్తారు. రౌద్రం, హీరోయిజం కలగలిపి ఉండేలా ప్రశాంత్ నీల్ చూసుకుంటారు. ప్రశాంత్ నీల్ సినిమాల్లో స్క్రీనింగ్, విలనిజం, మేకింగ్ వంటి వాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే 'సలార్' మూవీ తర్వాత ఎన్టీఆర్ కోసం రెడీ చేసిన కథలో భారీ యాక్షన్ సీన్స్ మేళవించినట్లు తెలుస్తోంది. 



ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో నటించనున్నారు. ఈ నెలాఖరుకు మూహుర్తం పెట్టి.. మూవీ రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి షురూ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తి కాగానే ప్రశాంత్ నీల్ తో సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో రూపొందించనున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.  


Also Read: OTT Streaming: మెగా అభిమానులకు పండగే..ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాలు ఇవాళ్టి నుంచే స్ట్రీమింగ్


Also Read: NTR Birthday: నువ్వు నాకెవరో అని ఒక్క పదంలో నిర్వచించలేను.. తారక్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook