సినీనటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 23వ వర్థంతి సందర్భంగా.. ఆయన మీద రూపొందిస్తోన్న బయోపిక్‌‌కి సంబంధించి ఫస్ట్‌లుక్‌ను నిర్మాతలు విడుదల చేశారు. ఈ చిత్రానికి ఇప్పటికే ‘ఎన్టీఆర్‌’ అనే టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫస్ట్‌లుక్‌లో ఎన్టీఆర్‌ భారీస్థాయిలో వచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తు్న్న స్టిల్ ఇప్పటికే నెటిజన్లను ఆకట్టుకుంటోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయంగా జీవించిన ఓ మహానుభావునికి ఇదే మా నివాళి..’ అన్న ట్యాగ్‌లైన్‌తో ఈ ఫస్ట్ లుక్ విడుదల కావడం విశేషం. ఈ బయోపిక్‌లో స్వర్గీయ నందమూరి తారకరామారావు పాత్రలో ఆయన కుమారుడు బాలకృష్ణ నటిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నారు.


అదేవిధంగా ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకం పాత్రకు సంబంధించి ఎవర్ని తీసుకోవాలన్న విషయంలో కూడా ఇప్పటికే తర్జనభర్జనలు పడ్డారు నిర్మాతలు. ఆఖరికి ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీని అందుకోసం వాడనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎన్టీఆర్‌ జీవితాన్ని, అలాగే లక్ష్మీపార్వతితో వివాహం మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకొని రామ్‌గోపాల్‌ వర్మ కూడా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌’ అనే బయోపిక్‌ను తీస్తున్నారు. అలాగే కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కూడా లక్ష్మీపార్వతి జీవితకథను బేస్ చేసుకొని, లక్ష్మీస్ వీరగ్రంథం అనే సినిమా తీస్తున్నారు.