Jr NTR: నాని డైరెక్టర్ తో ఎన్టీఆర్ సినిమా.. ఈసారి కూడా సీక్వెల్ కి రంగం సిద్ధం!
NTR 32: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకవైపు ప్రశాంత్ నీల్.. దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఇప్పుడు మరొక డైరెక్టర్ తో.. సినిమాలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
NTR upcoming movies: ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన RRR వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత.. జూనియర్ ఎన్టీఆర్ మోస్ట్ వాంటెడ్ హీరోలలో ఒకరిగా మారారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కి బోలెడు భారీ బడ్జెట్ సినిమా ఆఫర్లు వచ్చి పడ్డాయి. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న దేవర సినిమా సెప్టెంబర్ 27, 2024 న విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.
దేవర: పార్ట్ 1 కాకుండా ఎన్టీఆర్ హృతిక్ రోషన్ హీరోగా యశ్ రాజ్ ఫిల్మ్స్ తెరకెక్కిస్తున్న.. స్పై యూనివర్స్ సినిమా వార్ 2 కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం 2025 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలకు సిద్ధమవుతుంది.
తాజాగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ యువ దర్శకుడు శౌర్యువ్ తో ఓ సినిమా గురించి చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమాతో శౌర్యువ్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఇప్పుడు శౌర్యువ్ జూనియర్ ఎన్టీఆర్ కి ఒక మంచి కథను చెప్పారట. కథ చాలా బాగా నచ్చడంతో ఎన్టీఆర్ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేయమని కోరారట.
అయితే ఇది ఒక యాక్షన్ డ్రామా అని.. రెండు భాగాలుగా విడుదల అవుతుంది అని సమాచారం. అయితే ఎన్టీఆర్ 2025 కల్లా తన చేతుల్లో ఉన్న సినిమాలను పూర్తి చేస్తారు అని టాక్. అన్నీ అలాగే జరిగితే, 2026 మొదట్లో శౌర్యువ్ తో ఎన్టీఆర్ సినిమా మొదలు అవుతుంది. ఇక చిత్ర మొదటి భాగం 2028లో, రెండవ భాగం 2031లో విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్.
శౌర్యువు వంటి టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ సినిమాలో యంగ్ టైగర్ ఎలా ఉంటారో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. శౌర్యువ్.. ఒకే ఒక సినిమా చేసినా కూడా టాలెంట్ చూసి ఎన్టీఆర్ మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఈ సంవత్సరం చివర్లో సినిమా.. ఫైనల్ వెర్షన్ నేరేషన్ జరిగిన తర్వాత, జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి సంతకం చేసే అవకాశం ఉంది.
Also Read: Revanth vs Tollywood: నా మాటలకే స్పందన ఇవ్వరా? సినీ పరిశ్రమపై మళ్లీ రేవంత్ రెడ్డి అసంతృప్తి
Also Read: Telangana Assembly: అసెంబ్లీలో ఆసక్తికర చర్చ.. రేవంత్ రెడ్డి సీటుకు ఎసరు పెట్టిన కోమటిరెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter