NTR after Balakrishna: అప్పుడు బాబాయ్, ఇప్పుడు అబ్బాయ్.. విశ్వక్ కోసం కదిలిన నందమూరి హీరోలు!
NTR for Dhamki Pre-Release: దాస్ కా ధమ్కీ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహిస్తుండగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ హాజరు కాబోతుండటం ఆసక్తికరంగా మారింది.
NTR to attend Dhamki Pre-Release: ఈ మధ్య కాలంలో చిన్న హీరోలకు బడా హీరోలు అండగా నిలుస్తున్న దాఖలాలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి. చిన్న హీరోల సినిమా ఫంక్షన్లకు, ఈవెంట్‌లకు హాజరైతే వారికి మరింత బూస్ట్ లభిస్తుందని భావిస్తున్నారు బడా హీరోలు. అలా చిన్న హీరోలను ఎంకరేజ్ చేయడానికి ఏ మాత్రం వెనకాడడం లేదు. విశ్వక్ సేన్ హీరోగా ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'దాస్ కా ధమ్కీ' సినిమా కూడా త్వరలో రిలీజ్ కానుంది.
వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది కానీ పలు కారణాలతో వాయిదా పడింది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ త్వరలో గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్రణాలికలు సిద్ధం చేస్తున్నారు మేకర్స్. అయితే ఈ ఈవెంట్‌కు ఇంటర్నేషల్ స్టార్‌డమ్ తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం మీద సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటన చేయలేదు కానీ దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది.
ఫలక్‌నామా దాస్ సినిమా తర్వాత స్వయంగా విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న 'దాస్ కా ధమ్కీ' మీద భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా నివేదా పేతురాజ్ నటిస్తోంది. ఆమె కాకుండా సినిమాలో రావు రమేష్, తరుణ్ భాస్కర్ ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. అజయ్, ఆది, మహేష్, రోహిణి, పృథ్వీరాజ్, కాదంబరి కిరణ్ వంటి వారు సైతం ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను తన సొంత బ్యానర్ వన్మయీ క్రియేషన్స్ మీద విశ్వక్ సేన్ నిర్మిస్తున్నాడు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. విశ్వక్ సేన్ కెరియర్‌లో ఈ దాస్ కా ధమ్కీ మూవీ మొట్ట మొదటి పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతుంది. తెలుగు, తమిళం, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో సినిమాను విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికెట్‌ను ఇచ్చింది. ఈ నెల 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా దాస్ కా ధమ్కీ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
వచ్చే వారంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ హాజరు కాబోతుండటం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్లకు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై... విశ్వక్ సేన్‌కు మంచి జోష్ ఇచ్చాడు. ఇప్పుడు మరోసారి నందమూరి హీరోనే ఈవెంట్‌కు హాజరవుతూ ఉండడం ఆసక్తికరంగా మారింది.
Also Read: Priyanka Chopra Photos: లో దుస్తులు లేకుండా ప్రియాంక పరువాల విందు.. నెవర్ బిఫోర్ అనిపించే అందాల జాతర!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి