Nusrat Jahan : మీ బిడ్డకు తండ్రి ఎవరో చెప్పండి?.. నటి షాకింగ్ రిప్లై
Nusrat Jahan: బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ చేదు అనుభవం ఎదురైంది. బుధవారం కోల్‌కతాలో ఓ సెలూన్ ప్రారంభోత్సవానికి ఆమె హాజరయ్యింది. ఈ సందర్భంగా బిడ్డ తండ్రెవరు అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి సమాధానంగా బిడ్డ తండ్రి ఎవరో ఆ తండ్రికి తెలుసు అంటూ ఘాటు సమాధానం ఇచ్చింది.
Nusrat Jahan: సెలబ్రీటీల పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరికి ఉంటుంది. కొందరైతే ఈ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ వారి కోపానికి కారణమవుతుంటారు. అలాంటి ప్రశ్నే బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ ఎదురైంది.
వివరాల్లోకి వెళితే..
నుస్రత్ జహాన్(Nusrat Jahan) ఈ మధ్యే ఓ మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తల్లైన దాదాపు నెల తర్వాత మొదటిసారి ఆమె పబ్లిక్‌లోకి వచ్చింది. బుధవారం కోల్‌కతా(Kolkata)లో ఓ సెలూన్ ప్రారంభోత్సవానికి ఆమె హాజరయ్యింది. ఈ సందర్భంగా బిడ్డ తండ్రెవరు అని ఓ రిపోర్టర్(Reporter) అడిగిన ప్రశ్నకి సమాధానంగా బిడ్డ తండ్రి ఎవరో ఆ తండ్రికి తెలుసు అంటూ ఘాటు సమాధానం ఇచ్చింది.
Also Read: Uttar Pradesh: హాట్ హాట్‌గా యూపీ రాజకీయాలు, ప్రచారం ప్రారంభించేసిన ఒవైసీ
కాగా, జూన్ 19, 2019లో నుస్రత్, వ్యాపారవేత్త నిఖిల్ జైన్(Nikhil Jain) టర్కీలోని ప్రైవేటు వెడ్డింగ్ సెరెమనీలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే నవంబర్ 2020 నుంచి విభేదాల కారణంగా వారిద్దరూ విడిగా ఉంటున్నారు. అనంతరం 2021లో భారతీయ చట్టాల ప్రకారం జైన్‌తో తన వివాహం చెల్లదని నటి వెల్లడించింది. ఆ సమయంలో ఆ బ్యూటీ బెంగాలీ నటుడు యశ్వంత్ దాస్‌గుప్తా(Yashwant Dasgupta) రిలేషన్‌షిప్(Relationship)లో ఉందని రూమర్స్ వినిపించాయి. ఈ తరుణంలో గతనెల ఆమె ఓ మగబిడ్డకి జన్మనివ్వడం చర్చనీయాంశంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook