Orange Re Release రామ్ చరణ్‌ బర్త్ డే (మార్చి 27) సందర్భంగా మగధీర సినిమాను రీ రిలీజ్ చేయాలని అనుకున్నారు. అసలే ఇప్పుడు అంతా కూడా రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ రీ రిలీజ్‌ల విషయంలో కొన్ని సినిమాలు బోల్తా కొట్టేస్తున్నాయి. ఇంకొన్ని బ్లాక్ బస్టర్‌లుగా నిలుస్తున్నాయి. అసలు ఈ ట్రెండ్‌ను మహేష్‌ బాబు ఫ్యాన్స్ గత ఏడాది స్టార్ట్ చేశారు. మహేష్‌ బాబు బర్త్ డే సందర్భంగా పోకిరి సినిమాను రీ రిలీజ్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ తరువాత పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్ తమ్ముడు, జల్సా సినిమాలను రిలీజ్ చేశారు. వాటికి వచ్చిన కలెక్షన్లను జనసేనకు విరాళంగా ఇచ్చారు. ఇక న్యూ ఇయర్ స్పెషల్‌గా ఖుషి సినిమాను రిలీజ్ చేస్తే ఏకంగా వారం రోజులు ఆడేసింది. పది కోట్ల గ్రాస్ కొల్లగొట్టేసినట్టుంది. అయితే మధ్యలో బాలయ్య చెన్నకేశవ రెడ్డిని కూడా రీ రిలీజ్ చేశారు. కానీ అంతగా ఆడలేదు. చిరంజీవి గ్యాంగ్ లీడర్ సైతం అంతగా ఆకట్టుకోలేకపోయింది.


ఇప్పుడు రామ్ చరణ్‌ నటించిన మగధీర సినిమాను రీ రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఒక వేళ మళ్లీ ఈ సినిమాను రిలీజ్ చేసి ఉంటే బాగానే ఆడే అవకాశాలున్నాయి. అయితే ఆరెంజ్ సినిమాను రీ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. ఆరెంజ్ సినిమాకు నాగబాబు నిర్మాత. రీ రిలీజ్ విషయంలో ఎలాంటి అడ్డంకులు కూడా ఉండవు. వచ్చిన మొత్తాన్ని జనసేనకు విరాళంగా ఇవ్వాలని భావిస్తున్నారట. అందుకే ఆరెంజ్ సినిమాను రీ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట.


పైగా ఆరెంజ్ సినిమా ఇప్పుడు వస్తే హిట్ అవుతుందని అంతా అంటారు. దీంతో ఆరెంజ్ సినిమా ఇప్పుడు రిలీజ్ చేస్తే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారా? అని అంతా అనుకుంటున్నారు. పాటలు అయితే ఎప్పటికీ ఎవర్ గ్రీన్‌గానే నిలిచి ఉంటాయని తెలిసిందే. ఇక ఈ సినిమా రీ రిలీజ్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.


Also Read:  Shruti Haasan : నెటిజన్ల తిక్క ప్రశ్నలు.. శ్రుతి హాసన్‌ సమాధానాలివే.. ఛీ ఛీ ఇదేం దరిద్రం!


Also Read: Nidhhi Agerwal : జోరు పెంచేసిన నిధి అగర్వాల్.. అదరహో అనాల్సిందే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook