NTR- Samantha: టాలీవుడ్ టాపర్లుగా ఎన్టీఆర్, సమంత.. టాప్ టెన్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారంటే?
Ormax Most popular Telugu film stars for July 2022: తెలుగులో టాప్ టెన్ హీరోలు, హీరోయిన్ల జాబితాను ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసింది. ఎన్టీఆర్, సమంత ఈ లిస్టులో టాప్ ప్లేసులు సంపాదించారు.
Ormax Most popular male Telugu film stars for July 2022: తెలుగులో టాప్ టెన్ హీరోలు ఎవరు అనే విషయం మీద ప్రతినెలా ఒక ఆన్ లైన్ సర్వే చేసి ఒక జాబితా విడుదల చేస్తున్న విధంగా ఆర్మాక్స్ మీడియా అనే సంస్థ మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ జూలై 22కు సంబంధించిన జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో జూనియర్ ఎన్టీఆర్ మొదటి స్థానం దక్కించుకోగా రెబల్ స్టార్ ప్రభాస్ రెండో స్థానం దక్కించుకున్నాడు. అల్లు అర్జున్ మూడో స్థానంతో సరిపెట్టుకోగా రామ్ చరణ్ తేజ నాలుగో స్థానంలో నిలిచారు.
అలాగే మహేష్ బాబు అయిదవ స్థానం, హీరో నాని ఆరవ స్థానం, పవన్ కళ్యాణ్ ఏడో స్థానంలో నిలిచారు. పాన్ ఇండియా హీరోగా ఎంట్రీ ఇస్తున్న విజయ్ దేవరకొండ మాత్రం ఈ జాబితాలో 8వ స్థానంలో నిలిచారు. అలాగే తొమ్మిదవ స్థానంలో మెగాస్టార్ చిరంజీవి, పదో స్థానంలో రవితేజ నిలిచారు. నిజానికి ఒక ఏడాది పైగా మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంటి మహేష్ బాబు ఇప్పుడు వెనక్కి వెనక్కి వెళుతున్నారు.
ఆయన గతంలో నటించిన సర్కారు వారి పాట సినిమా ప్లాప్ అవడంతో ఎన్టీఆర్ ఇప్పుడు ఆ స్థానాన్ని ఆక్రమించారు. ఇక ఎన్టీఆర్ ఆస్కార్ బరిలో కూడా నిలిచే అవకాశం ఉందంటూ వెరైటీ మ్యాగజిన్ ఒక లిస్టు ప్రచురించడం కూడా గత కొద్దిరోజులుగా హాట్ టాపిక్ గా నిలుస్తోంది. దీంతో వచ్చే నెలలో కూడా అంటే ఆగస్టు నెలకు సంబంధించిన లిస్టులో కూడా ఆయనే ప్రథమ స్థానంలో నిలిచే అవకాశం కనిపిస్తోంది. [[{"fid":"241486","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
Ormax Most popular Female Telugu film stars for July 2022: ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే ఎప్పటిలాగే సంవత్సరానికి పైగా మొదటి స్థానాన్ని ఆక్రమిస్తూ వస్తున్న సమంత ఈ నెలలో కూడా మొదటి స్థానాన్ని సంపాదించింది. తర్వాత స్థానంలో ఒక కాజల్ అగర్వాల్ నిలిచింది. కాజల్ ప్రస్తుతానికి సినిమాలతో బిజీగా లేదు. ఆమె తన మాతృత్వపు మాధుర్యాన్ని ఆనందిస్తోంది. తర్వాత స్థానంలో పూజా హెగ్డే, సాయి పల్లవి, అనుష్క శెట్టి, కీర్తి సురేష్, తమన్నా, రష్మిక మందన్న, కృతి శెట్టి, రాశిఖన్నా మొదటి పది స్థానాలు సంపాదించారు. మా హీరోయిన్ ను కొట్టే హీరోయినే లేదా అంటూ ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.[[{"fid":"241487","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
Also Read: Bimbisara vs Sita Ramam: పదిరోజుల్లో కోట్లలో లాభాలు.. ఫుల్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఇదే!
Also Read: Karthikeya 2: రెండో రోజు మరింత పెరిగిన కార్తికేయ 2 వసూళ్లు.. బ్రేక్ ఈవెన్ కు ఇంకెంత దూరమంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి