Naatu Naatu oscar Nominations : టాలీవుడ్ హిస్టరీలో ఫస్ట్ టైం.. నామినేట్ అయిన నాటు నాటు
oscar 95 Nominations ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. ఈ క్రమంలో ఇప్పుడు ఆస్కార్ అవార్డు కూడా వచ్చేలా ఉంది.
oscar 95 Best Original Song Naatu Naatu ఆస్కార్ 95వ రేసులో మన ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ నిలిచింది. ఇక ఇది మన టాలీవుడ్ హిస్టరీలో ఫస్ట్ టైం అవ్వడంతో అంతా ఆనందంలో మునిగి తేలుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాకి అరుదైన గౌరవం దక్కింది. ఈ సినిమాలో కీరవాణి స్వరపరిచిన నాటు నాటు సాంగ్ ఇప్పటికే ఎంత ఫేమస్ అయిందో చెప్పక్కర్లేదు.
ఇప్పటికీ ఈ సినిమాకు గోల్డ్ అవార్డు కూడా దక్కగా ఇప్పుడు తాజాగా ఆస్కార్ అకాడమీ అవార్డులకు సంబంధించి జరిగిన నామినేషన్స్ లో కూడా ఈ సాంగ్ నామినేషన్స్ లోకి వెళ్ళింది. ఈ నాటు నాటు సాంగ్ కి జూనియర్ ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా కాలు కదిపారు. ఆ ఇద్దరూ కూడా ఒకే సింక్లో చేయడం కోసం అనేక రోజులు పాటు కష్టపడి ఈ సాంగ్ కి పెర్ఫార్మ్ చేసినట్లుగా సినిమా ప్రమోషన్స్ లో అనేకసార్లు వెల్లడిస్తూ వచ్చారు.
ఇక డివివి దానయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ లేడీ లీడ్ రోల్స్ లో నటించారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటించారు. ఇక నాటు నాటు సాంగ్ ని రాహుల్ సిప్లిగంజ్ ఆలపించగా కీరవాణి స్వరపరిచారు, చంద్రబోస్ ఈ పాటకు సాహిత్యం అందించారు. ఇక ఈ సాంగ్ గురించి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇక ఈ నేపద్యంలో ఈ సాంగ్ కచ్చితంగా ఆస్కార్ అవార్డు సాధించే అవకాశం ఉందని రాజమౌళి అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు, కీరవాణి అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Veera Simha Reddy Day 12 : ఎట్టకేలకు హిట్ కొట్టేసిన బాలయ్య.. లాభం ఎంత అంటే?
Also Read: Oscar Nominations: ఆస్కార్ నామినేషన్ల అధికారిక ప్రకటన ఇవాళే, ఆర్ఆర్ఆర్ పరిస్థితి ఏంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook