Oscar Awards 2022: ప్రపంచ సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆస్కార్ 94వ అవార్డుల ప్రదానోత్సవానికి ఇంకా మరికొద్ది గంటలే మిగిలి ఉంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఉన్న డాల్బీ థియేటర్స్ వేదికగా ఈ అవార్డుల వేడుక జరగనుంది. తొలిసారి ఆస్కార్ అత్యుత్తమ చిత్రం రేసులో 10 చిత్రాలు పోటీ పడుతున్నాయి. ఈసారి అవార్డుల వేడుకను అమీ షుమెర్, వాండా సైక్స్, రెజీనా హాల్ అనే ముగ్గురు మహిళా యాంకర్స్ హాస్ట్ చేయనున్నారు. ఇలా ముగ్గురు మహిళలు ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి హోస్ట్‌గా వ్యవహరించడం ఇదే తొలిసారి. ఇండియాలో ఏ రోజు, ఏ సమయానికి, ఏ టీవీ చానెల్‌, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ కార్యక్రమం లైవ్ టెలికాస్ట్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎప్పుడు.. ఏ ప్లాట్‌ఫామ్‌లో...:


ఆస్కార్ 94వ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అమెరికాలో మార్చి 27న జరగనుంది. ఇండియాకు అమెరికాకు 9 గంటల వ్యత్యాసం ఉంటుంది కాబట్టి.. మన దేశంలో మార్చి 28న ఉదయం 5.30 గంటలకు ఆస్కార్ అవార్డుల కార్యక్రమం లైవ్ టెలికాస్ట్ అవుతుంది. స్టార్ మూవీస్ హెచ్‌డీ, స్టార్ మూవీస్ సెలెక్ట్ హెచ్‌డీ, స్టార్ వరల్డ్, స్టార్ వరల్డ్ హెచ్‌డీ, స్టార్ వరల్డ్ ప్రీమియర్ హెచ్‌డీ చానెళ్లలో ఈ కార్యక్రమం లైవ్ ప్రసారమవుతుంది. 


డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్లాట్‌ఫామ్‌లోనూ ఈ కార్యక్రమం లైవ్ వీక్షించవచ్చు. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో స్టార్స్ బిల్లీ ఐలీష్, ఫినియస్ ఒ కొనెల్ లేటెస్ట్ 'జేమ్స్ బాండ్' సినిమాలోని 'నో టైమ్ టు డై' సాంగ్‌కి పెర్ఫామ్ చేయనున్నారు. వీరితో పాటు మరికొందరు స్టార్స్ తమ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకోనున్నారు.


Also Read: Women’s World Cup 2022: చివరి బంతికి భారత్ ఓటమి.. వెస్టిండీస్ మహిళల సంబరాలు మాములుగా లేవు (వీడియో)!


DC vs MI: ఇషాన్ కిషన్ సూపర్ ఇన్నింగ్స్... ఢిల్లీ ముందు 178 పరుగుల లక్ష్యం..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook