Oscar Shortlist: ఆస్కార్ రేసు నుంచి `2018` ఔట్.. డైరెక్టర్ పోస్ట్ వైరల్..
2018 Movie: ఆస్కార్ అవార్డుల షార్ట్‌లిస్ట్ విడుదలైంది. మన దేశం తరపున పోటీపడిన మలయాళ సూపర్ హిట్ మూవీ 2018 తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.
Oscar Shortlist: ఆస్కార్ రేసు నుంచి మలయాళ సూపర్ హిట్ మూవీ 2018 ఔటయింది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో భారత్ నుంచి నామినేట్ అయిన ‘2018’ చిత్రం తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. 96వ ఆస్కార్ అవార్డుల కోసం బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరీలో షార్ట్‌లిస్ట్ అయిన పదిహేను సినిమాలు జాబితాను అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ విడుదల చేసింది. ఇందులో 2018 మూవీ పేరు లేదు. దీంతో మూవీ లవర్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. లిస్ట్ లో 2018 మూవీ లేకపోవడం బాధను కలిగించిందని ఆ చిత్ర దర్శకుడు జూడ్ ఆంథోనీ జోసెఫ్ అన్నారు. ఈ సందర్భంగా జోసెఫ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది.
2018లో కేరళలో సంభవించిన వరదల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు జూడ్ ఆంథోనీ జోసెఫ్. టోవినో థామస్, కుంచకోబోబన్, వినీత్ శ్రీనివాసన్, అపర్ణ బాలమురళి తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. ఈ ఏడాది మే నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ 150 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. మలయాళ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ మూవీకి విడుదలైన అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్‌లో ఫిల్మ్ మేకర్ గిరీష్ కాసరవల్లి అధ్యక్షతన 17మంది సభ్యులతో కూడిన కమిటీ 2018 సినిమాను ఎంపిక చేసి ఇండియా నుంచి ఆస్కార్స్ కోసం అఫీషియల్ ఎంట్రీగా పంపారు.
Also Read: Devil Movie: కళ్యాణ్ రామ్ స్పై థ్రిల్లర్ ‘డెవిల్’ సెన్సార్ పూర్తి.. డిసెంబర్ 29న గ్రాండ్ రిలీజ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook