Malayalam Movies on OTT:  థియేటర్లలో సినిమాని చూసినా చూడకపోయినా.. ఓటీటీలో విడుదలైన మొదటి రోజే సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు ప్రేక్షకులు. ఆ రేంజ్ లో ఓటీటీల హవా ఇప్పుడు బాగా పెరిగిపోయింది. ఆసక్తికరంగా తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా మిగతా భాషాల సినిమాలు కూడా.. ఇప్పుడు ఓటీటీలో బాగానే హడావిడి చేస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మధ్యకాలంలో తెలుగులో కూడా పెద్ద చెప్పుకోదగ్గ సినిమాలు రాకపోవడం, స్టార్ హీరోల సినిమాలు కూడా రాకపోవడంతో చాలావరకు పరభాష సినిమాలు ఓటీటీలో బాగా ఊపందుకున్నాయి. ముఖ్యంగా మలయాళం ఇండస్ట్రీ నుంచి చాలా సినిమాలు ఓటీటీలో కూడా విడుదల అయ్యి భారీ విజయాలను సాధించాయి. మరి ఈ వారం విడుదల కోసం.. సిద్ధం అవుతున్న పరభాష సినిమాలు ఏంటో చూసేద్దాం.


ది గోట్‌ లైఫ్‌ (ఆడు జీవితం)


పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ఆడు జీవితం (ది గోట్ లైఫ్) థియేటర్లలో భారీ విజయాన్ని సాధించింది. బెన్నీ డేనియల్ రాసిన గోట్ డేస్ అనే ఒక నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ప్రముఖ డైరెక్టర్ బ్లెస్సి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో త్వరలో స్ట్రీమ్ కాబోతోంది. 


అరుణ్మయి 4 / బాక్:


తమన్నా, రాశి కన్నా హీరోయిన్లుగా నటించిన కామెడీ హారర్ బాక్ తమిళ్లో బ్లాక్ బస్టర్ కాగా తెలుగులో అంతంతమాత్రంగానే కలెక్షన్లను అందుకుంది. ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమ్ అవుతోంది. తమిళ్లో సూపర్ హిట్ అయ్యి తెలుగులో మాత్రం ఫ్లాప్ అయిన ఈ సినిమా.. ఓటీటీలో ఎంతవరకు విజయం సాధిస్తుందో చూడాలి.


గరుడన్: 


తమిళ్ లో బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమా ఎప్పుడు ఓటిటిలో విడుదల అవుతుందా అని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో.. జూన్ 28వ తేదీ నుంచి స్ట్రీమ్ కానుంది. తెలుగులో కూడా స్ట్రీమ్ చేయచ్చు.


గురువాయూర్ అంబలనాడయిల్:


కోలీవుడ్‌ ప్రముఖ కమెడియన్‌ యోగిబాబు కీలక పాత్ర పోషించిన గురువాయూర్ అంబలనాడయిల్ చిత్రం.. ఓటీటీలో తెలుగు వెర్షన్‌లో కూడా జూన్‌ 28వ తేదీ నుంచి స్ట్రీమ్ కానుంది. 


టర్బో:


ఇక మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన.. సస్పెన్స్ థ్రిల్లర్ టర్బో సినిమా. ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ లో జూన్ 28వ తేదీ నుండి తెలుగులో కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Read more: Viral News in Telugu: కొంపముంచిన రీల్.. 300 అడుగుల లోతైన లోయలో పడిపోయిన కారు.. షాకింగ్ వీడియో


Read more: Viral video: అట్లుంటదీ మల్ల.. నరసింహ మూవీ స్టైల్ లో పాముకు కిస్ ఇచ్చిన తాత.. వీడియో వైరల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి