Paagal Trailer: విశ్వ‌క్ సేన్, నివేదా పేతురాజ్ జంట‌గా న‌టించిన పాగల్ చిత్ర ట్రైలర్(paagal movie trailer) రిలీజ్ అయింది. ఈ ట్రైల‌ర్ చూస్తుంటే ఇదో యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైనర్ గా సాగ‌బోతున్నట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నుమా దాస్, హిట్ లాంటి సినిమాల తర్వాత విశ్వక్ సేన్ ఇమేజ్ బాగానే పెరిగిపోయింది.  ఇదిలా ఉంటే ఇప్పుడు ఈయన నటిస్తున్న సినిమా పాగల్(Paagal Movie). నరేష్ కుప్పలి(Naresh Kuppali) తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో పూర్తైపోయింది. 



 


Also Read:క్యాన్సర్‌తో పోరాడుతూ నటి శరణ్య శశి మృతి


నిజానికి ముందుగానే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా చాలా నెలలుగా వాయిదా పడుతూ వస్తుంది. చివరికి ఆగస్ట్ 14న పాగల్ సినిమా(Paagal Movie) థియేటర్స్‌లో విడుదల కానుంది. దిల్ రాజు(Dil Raju) సమర్పిస్తున్న పాగల్ సినిమాను బెక్కం వేణుగోపాల్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, పాటలకు మంచి ఆదరణ లభించింది.


ఇప్పుడు రిలీజ్ చేసిన ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందులో కనిపించిన ప్రతీ అమ్మాయిని ప్రేమించే పాగల్ ప్రేమికుడిగా విశ్వక్ సేన్(Vishwak Sen) కనిపిస్తున్నాడు. 1600 మంది అమ్మాయిలను ప్రేమించే పాత్రలో నటిస్తున్నాడు ఈ కుర్ర హీరో. చివరికి ఒక్క అమ్మాయితో సీరియస్‌గా ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి నివేదా పేతురాజ్(Niveda Pethuraj). ఆ తర్వాత ఏమైంది అనేది అసలు కథ. క్రేజీ లవ్ స్టోరీగా పాగల్ సినిమా వస్తుంది. ట్రైలర్ చూస్తుంటేనే సినిమా ఎలా ఉండబోతుందో కూడా క్లారిటీ వచ్చేసింది. ఆగస్ట్ 14న భారీగానే పాగల్ సినిమాను విడుదల చేయబోతున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook