Padma Bhushan Shobhana: రుద్రవీణలో హృద్యమైన నాట్య కళాకారిణిగా.. నారీ నారీ నడము మురారిలో బావ ప్రేమ కోసం ఎదురు చూసే ప్రేమికురాలిగా.. రౌడీ మొగుడును దారిలో పెట్టే రౌడీ గౌరీ పెళ్లాంగా.. అభినందనలో ప్రేమికుడితో విడిపడిన ప్రేమికురాలిగా  ఇలా క్యారెక్టర్ ఏదైనా అందులో పాత్ర కనపడుతోంది. కానీ ఆమె కనిపించదు.  ఆమె శోభన. బాల నటిగా ‘భక్త ధృవ మార్కండేయ’ సినిమాతో పరిచయమైంది. ఆ తర్వాత వి. మధుసూదన రావు దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన ‘విక్రమ్’ చిత్రంతో కథానాయికగా పరిచయమై ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. కేవలం నటిగానే కాకుండా.. క్లాసికల్ డాన్సర్ గా నాట్య మయూరిగా  ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శోభన.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శోభన బ్యాక్ గ్రౌండ్ విషయానికొస్తే.. క్లాసికల్ డాన్సుల్లోనను.. నటనలోను ఫేమస్ అయిన లలిత, పద్మిని, రాగిణిల మేనకోడలుగా శోభన తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో నటించి మెప్పించారు. అంతేకాదు తెలుగులో సీనియర్ హీరోలైన చిరంజీవితో రుద్రవీణ, రౌడీ అల్లుడు .. బాలకృష్ణతో మువ్వ గోపాలుడు, నారీ నారీ నడుమ మురారి, వెంకటేష్ తో అజేయుడు, త్రిమూర్తులు,నాగార్జునతో విక్రమ్ తోపాటు నేటి సిద్ధార్ధ, రక్షణ..  మోహన్ బాబుతో అల్లుడు గారు, రౌడీ గారి పెళ్లాం, గేమ్ , రజినీకాంత్ తో దళపతి   చిత్రాల్లో నటించి మెప్పించింది.


ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..


ఇక ప్యాన్ ఇండియా లెవల్లో అన్ని భాషల్లో సక్సెస్ అయిన చంద్రముఖి అసలు సినిమా అయిన ‘మణిచిత్రతాళు’ సినిమాలోని నటనకు జాతీయ అవార్డు అందుకుంది. ఆ తర్వాత మిత్ర్ మై ఫ్రెండ్ అనే ఇంగ్లీష్  చిత్రంలోని నటనకు రెండో సారి జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకోవడం విశేషం. ఈమె గతంలో 2006లో కేంద్రం పద్మశ్రీ ప్రకటించింది. ఇక 1994లో శోభన ‘కళార్పణ’ అనే డాన్స్ కాలేజ్ ను స్టార్ట్ చేసి ఆసక్తిగల వాళ్లకు నాట్యంలో శిక్షణ అందిస్తోంది. అంతేకాదు దేశ, విదేశాల్లో నాట్య ప్రదర్
శనలు


ఆమె నాట్యంలోనూ, నటనలోనూ ప్రసిద్ధి గాంచిన లలిత, పద్మిని, రాగిణిల మేనకోడలు. తెలుగుతో పాటు తమిళ, మలయాళంలో నటించి మెప్పించిన శోభనకు (Shobhana) కళారంగంలో చేసిన సేవలకు గానూ తాజాగా కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించింది.


ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!


ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.