Prabhas-Hanu Raghavapudi movies update: శ్రీ ప్రభాస్.. కల్కి 2898AD సినిమాతో తన పేరుని మార్చుకున్న ఈయన ఇప్పుడు ఏకంగా గ్లోబల్ స్థాయిలో ఇమేజ్ సొంతం చేసుకున్నారు. వరుస సినిమాలు చేస్తూ బిజీగా దూసుకుపోతున్న ప్రభాస్ ఇప్పటికే ఐదు సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఒక్కొక్క సినిమాను రివీల్ చేస్తూ అభిమానులకు ఫుల్ మీల్స్ అందించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం మారుతీ డైరెక్షన్లో రాజా సాబ్ సినిమాను విడుదల కు సిద్ధం చేస్తుండగా మరొకవైపు.. సీతారామం సినిమాతో ఏకంగా అవార్డుల పంట కురిపించిన డైరెక్టర్ హను రాఘవపూడి తో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక జరుగుతున్న నేపథ్యంలో హీరోయిన్గా దాయాది దేశమైన పాకిస్తాన్ బ్యూటీ సజల్ అలీ ను తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ ఇప్పటివరకు అమెరికా, ఆస్ట్రేలియా, గల్ఫ్, కొరియా, ఇంగ్లాండ్ వంటి దేశాలలో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. కానీ దాయాది దేశమైన పాకిస్తాన్లో మాత్రం తన సినిమాలతో అడుగుపెట్టలేదు..అందుకే అక్కడ కూడా తన మార్కెట్ను విస్తరించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు పాకిస్తాన్ నటితో రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతున్నారు అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది. ఇక ఈమెను ఇప్పుడు ఈ సినిమా కోసం స్క్రీన్ టెస్ట్ కూడా చేస్తున్నారట.అన్ని సెట్ అయితే  పాకిస్తాన్ హీరోయిన్ ఇందులో హీరోయిన్గా నటించబోతుందని చెప్పవచ్చు. త్వరలోనే ఈ విషయంపై చిత్ర బృందం అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. 


సజల్ అలీ ఇండియా సినీ ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు. దివంగత నటీమణి అతిలోకసుందరి అందాల తార శ్రీదేవి నటించిన మామ్ చిత్రంలో శ్రీదేవికి కూతురు పాత్రలో నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే సజల్ అలీ తల్లి మరణించడంతో ఇక అప్పటి నుంచి శ్రీదేవి ఈమెను తన మూడో కూతురుగా భావించిందట. సజల్ కూడా తన తల్లిని శ్రీదేవిలో చూసుకుందని సమాచారం.అలా మామ్ చిత్రం ద్వారా ఇండియన్ ఆడియన్స్ కి కూడా సజల్ అలీ పరిచయం అయ్యింది. ఈ ముద్దుగుమ్మను తన సినిమాలో పెట్టుకొని పాకిస్థాన్లో కూడా తన మార్కెట్ ను విస్తరింప చేసే ప్రయత్నం చేస్తున్నారు.. మరి ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ప్రస్తుతం ఈ సినిమా తర్వాత ప్రభాస్ స్పిరిట్, సలార్ -2, కల్కి 2898AD -2 వంటి చిత్రాలకు సైన్ చేశారు.


Also Read: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!


Also Read: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook