Adi Kesava Movie: గుడుల వెంట పడుతున్న యంగ్ హీరోలు.. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ కూడా?

Mega Hero Vaishnav Tej Adi Keshava Movie First Glimpse: ఒక పల్లెటూరు, ఆ ఊరిలో ఉన్న గుడి లేదా ఆ గుడిలో ఉన్న దైవం, దాని చుట్టూ అల్లుకున్న కథతో ఇప్పుడు తెరకెక్కుతున్న సినిమాలు ఆసక్తికరంగా విజయం సాధిస్తున్న క్రమంలో ఇప్పుడు అలాంటిదే మరో సినిమా కూడా రూపొందుతోంది.
Adi Kesava Movie Team Following a Hit Formula: ఒక పల్లెటూరు, ఆ ఊరిలో ఉన్న గుడి లేదా ఆ గుడిలో ఉన్న దైవం, దాని చుట్టూ అల్లుకున్న కథతో ఇప్పుడు తెరకెక్కుతున్న సినిమాలు ఆసక్తికరంగా విజయం సాధిస్తున్నాయి. ఆ మధ్య అఖండ, కాంతార, తర్వాత కార్తికేయ 2 ఈ మధ్య విడుదలైన విరూపాక్ష వంటి సినిమాలు ఇదే విషయాన్ని ప్రూవ్ చేశాయి.
ఇప్పుడు దాదాపు అదే కథాంశంతో మరో రెండు సినిమాలు వస్తున్నాయి. సందీప్ కిషన్ హీరోగా ఊరి పేరు భైరవకోన అనే ఒక సినిమా వస్తుండగా ఇప్పుడు ఆది కేశవ అనే మరో ప్రాజెక్టు కూడా దాదాపు ఇదే కథతో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమవుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి పంజా వైష్ణవ్ తేజ్ శ్రీ లీల జంటగా ఒక భారీ యాక్షన్ సినిమా రూపొందిస్తున్నాయి.
Also Read: Prabhas No.1: టాలీవుడ్ నెంబర్ 1 ప్రభాసే.. ఏప్రిల్ లో కూడా తగ్గని రెబల్ స్టార్
పంజా వైష్ణవ్ తేజ్ కెరీర్ లో నాలుగో సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకి ఆదికేశవ అనే పవర్ఫుల్ టైటిల్ ని ఫిక్స్ చేసి ఈ సినిమా ప్రపంచాన్ని అందులో ఉన్న పాత్రలను పరిచయం చేస్తూ సోమవారం నాడు సినిమా యూనిట్ ఒక భారీ యాక్షన్ ప్యాకెట్ గ్లింప్స్ రిలీజ్ చేసింది. ఇక ఈ గ్లింప్స్ లో పంజా వైష్ణవ్ తేజ్ రుద్ర పాత్రతో పరిచయం అవుతూ ఉండగా ఒక చిన్న గ్రామంలో కొంతమంది దుండగులు శివాలయాన్ని ఆక్రమించాలని చూస్తుండగా రుద్ర వారిని అడ్డుకోవాలని నిర్ణయించుకోవడంతో ఆ గొడవ ఎక్కడికి దారితీసింది? ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని ఆసక్తి కలిగించేలా ఈ గ్లింప్స్ ఉంది.
ఇక ఈ సినిమాలో చిత్ర అనే పాత్రలో శ్రీ లీల నటిస్తుండగా వజ్ర కాళేశ్వరీ దేవి అనే పాత్రలో మలయాళ నటి అపర్ణ దాస్ నటిస్తోంది. ఇక ఈ సినిమాతో మలయాళ నటుడు జోజు జార్జ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో ఆయన ఒక పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా ఈ తాజా గ్లింప్స్ కి ఆయన అందించిన సంగీతం మాత్రం హాట్ టాపిక్ గా మారింది.
Also Read: Samantha No.1: డిజాస్టర్లు వచ్చినా తగ్గేదేలే.. సమంత ఇంకా నెంబర్.1ఏ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook