Ari Director Jayashankar పేపర్ బాయ్ సినిమాతో సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు జయశంకర్. సున్నితమైన అంశాలను టచ్ చేస్తూ తీసిన పేపర్ బాయ్ మంచి ప్రయత్నంగా మిగిలింది. హీరోగా శోభన్‌కు, దర్శకుడిగా జయశంకర్, సంపత్ నంది బ్యానర్‌కు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. అయితే ఈ సినిమా తరువాత దర్శకుడిగా జయశంకర్‌గా కాస్త స్లో అయ్యాడనిపిస్తోంది. మళ్లీ ఇన్ని రోజులకు అరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనసూయ, శుభలేఖ సుధాకర్, సాయి కుమార్ వంటి ఆర్టిస్టులతో అరి అనే ఓ కొత్త ప్రయోగాన్ని జయశంకర్ చేయబోతోన్నాడు. ఇది వరకు రిలీజ్ చేసిన సాంగ్, ట్రైలర్ అన్నీ కూడా పాపులర్ అయ్యారు. చివరకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు దృష్టిలోనూ ఈ మూవీ ట్రైలర్ పడింది. మనిషికి ఉండే అరిషడ్వర్గాల మీద ఈ సినిమా ఉంటుందట. ఈ సినిమా చూస్తే కచ్చితంగా గొప్ప మనిషి ఎలా ఉండాలో అర్థం అవుతుందట. మంచి మనిషిగా మారుతారట.


త్వరలోనే రాబోతోన్నీ ఈ మూవీ గురించి డైరెక్టర్ జయశంకర్ ఎన్నో విషయాలను పంచుకున్నాడు. ఈ మూవీ షూటింగ్‌ను కేవలం ముప్పై రోజుల్లోనే పూర్తి చేశాడట. కరోనా వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతూనే వచ్చింది. ఈ సినిమా ప్రారంభం అవ్వడానికి, పూర్తి అవ్వడానికి టైం ఎక్కువగా పట్టిందట. కానీ షూటింగ్ మాత్రం కేవలం నెల రోజుల్లోనే పూర్తయిందట. ఇప్పుడు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట.


Also Read:  Sadha instead of indraja : ఇంద్రజ అవుట్ సదా ఇన్.. కొత్త జడ్జ్‌తో కళకళ


ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడాడు జయశంకర్. అమ్మాయిలకు ఏది బ్యాడ్ టచ్, ఏది గుడ్ టచ్.. ఏది గుడ్ లుక్స్, ఏవి బ్యాడ్ లుక్స్ అన్నది అర్థం అవుతుందని, అమ్మాయిల చేతుల్లోనే అంత ఉంటుందని, అమ్మాయిలే వాళ్లను కట్టడి చేయాల్సి ఉంటుందని, అయినా అందరికీ తెలిసిన ఇండస్ట్రీ కాబట్టి, క్యాస్టింగ్ కౌచ్ అంటే.. సినిమా ఇండస్ట్రీ అనుకుంటారన్నట్టుగా చెప్పుకొచ్చాడు. తాను చూసినంత వరకు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది కనిపించలేదని, టాలెంట్, పర్ఫామెన్స్ బాగుంటేనే సినిమాల్లో పెట్టుకుంటారని అన్నాడు.


Also Read:  Mothers Day 2023 : మదర్స్ డే స్పెషల్.. సెలెబ్రిటీల తల్లులు వీళ్లే.. పిక్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook