Director Jayashankarr: పేపర్ బాయ్ మూవీతో సున్నితమైన ఎమోషన్స్‌ను ఎంతో అద్భుతంగా చూపించి మంచి పేరు సంపాదించారు డైరెక్టర్ జయ శంకర్. ఆ తరువాత 'అరి' అంటూ అరిషడ్వర్గాల మీద సినిమా తీసి అందరిలోనూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. ఈ సినిమా త్వరలోనే ఆడియన్స్ ముందకు రానుంది. ఈ సినిమాను చూసిన పలువురు సెలబ్రిటీలు జయ శంకర్‌ను అభినందించారు. తప్పకుండా హిట్ అవుతుందని నమ్మకంతో చెప్పారు. ఈ క్రమంలో జయ శంకర్‌ తదుపరి చిత్రంపై సరికొత్త రూమర్లు వస్తున్నాయి. ఇప్పటికే ఆయన ఓ లేడి ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌ను సిద్ధం చేసుకోగా.. ఈ స్టోరీకి నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై కొత్త రూమర్లు మొదలయ్యాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Prabhas Joins Kannappa Shooting: ఎట్టకేలకు కన్నప్ప సెట్ లో అడుగుపెట్టిన ప్రభాస్..


ఈ ప్రాజెక్ట్‌కు సౌత్, నార్త్‌లో మంచి క్రేజ్ ఉన్న శ్రీలంక భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ను జయ శంకర్ సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను పాన్ ఇండియా వైడ్‌గా డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం జయ శంకర్ తీసిన అరి మూవీ ఎన్నికల తరువాత థియేటర్లలో సందడి మొదలుపెట్టనుంది. జూన్ ఆడియన్స్‌ ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 


పేపర్ బాయ్ సినిమా కథను నిత్య జీవితంలో జరిగే సంఘటనలు, మన సమాజంలోని నిత్యం చూస్తే విషయాల నుంచి తీసుకున్ జయ శంకర్.. అరి చిత్రాన్ని మాత్రం భిన్నంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ కథలో  దైవత్వం అనే పాయింట్‌తో కొత్త ఫాంటసీతో రూపొందించినట్లు టాక్. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్‌ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పోస్టర్‌లో ఇక్కడ అన్ని కోరికలు తీర్చబడును అనే క్యాప్షన్‌తో ఆసక్తి క్రియేట్ అయింది. వినోద్‌ వర్మ ప్రధాన పాత్రేంటి..? అన్ని కోరికలు తీర్చబడును అంటూ పెట్టిన  క్యాప్షన్‌కి అర్థం ఏంటి..? పోస్టర్ గతంలో వైరల్ అయింది. ఈ సినిమా మొత్తం ఆరు పాత్రలో చుట్టూ తిరుగుతుందని సమాచారం. ఈ సినిమాలో అనసూయ, సాయి కుమార్, శుభలేఖ సుధాకర్ తదితర కీలక పాత్రలు పోషించారు. 


Also read: Muslim Reservations: ముస్లిం రిజర్వేషన్లు తీసి ఆ వర్గాలకిచ్చేస్తాం, అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitte