పేపర్ బాయ్ టీజర్.. బీటెక్ బాబు `పేపర్ బాయ్` ఎందుకయ్యాడు ?
దర్శకుడు సంపత్ నంది నిర్మాతగా మారిన తర్వాత నిర్మిస్తున్న రెండో సినిమా పేపర్ బాయ్
దర్శకుడు సంపత్ నంది నిర్మాతగా మారిన తర్వాత నిర్మిస్తున్న రెండో సినిమా పేపర్ బాయ్. సంతోష్ శోభన్, ఐశ్వర్య వాత్కర్ అనే కొత్త జంట ఈ సినిమాతో హీరో, హీరోయిన్స్‌గా పరిచయం అవుతున్నారు. జయ శంకర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకు సంపత్ నంది స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నాడు. బీటెక్ చేసిన ఓ యువకుడు 'పేపర్ బాయ్'గా ఎందుకు మారాడు అనే కథాంశంతో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ లవ్ స్టోరీకి సంబంధించి తాజాగా టీజర్ రిలీజైంది.
సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్‌పై సంపత్ నంది నిర్మిస్తున్న ఈ సినిమాకు మరో యంగ్ మ్యూజిక్ కంపోజర్ భీమ్స్ సిసిరిలియో ట్యూన్స్ అందిస్తున్నాడు. సుకుమార్ తరహాలో నిర్మాతగా మారిన దర్శకులు నిర్మిస్తున్న సినిమాలు ఆడియెన్స్ దృష్టిని ఆకర్షిస్తూ తమ ప్రత్యేకతను చాటుకుంటోన్న సంగతి తెలిసిందే. అదే బాటలో వస్తోన్న పేపర్ బాయ్ టీజర్ సైతం ప్రస్తుతం ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటోంది.