`పరి ట్రైలర్`తో భయపెడుతున్న అనుష్క !
అనుష్క శర్మ తర్వాతి చిత్రం `పరి`కి సంబంధించిన ట్రైలర్ ఇవాళే విడుదలైంది.
అనుష్క శర్మ తర్వాతి చిత్రం 'పరి'కి సంబంధించిన ట్రైలర్ ఇవాళే విడుదలైంది. కర్నేష్ శర్మతో కలిసి పరి సినిమాను సంయుక్తంగా నిర్మించిన అనుష్క.. ఈ ట్రైలర్‌ని కూడా తానే స్వయంగా తన ట్విటర్ ఎకౌంట్ ద్వారా విడుదల చేసింది. ప్రొసిత్ రాయ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అనుష్క దుష్టశక్తులు కలిగిన ఓ యువతి పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.
ట్రైలర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం ఈ సినిమా హోలి పండగ సందర్భంగా మార్చి 2న విడుదల కానుంది. ఈ టీజర్‌లో సాధారణ యువతి నుంచి మంత్రగత్తెగా అవతరిస్తున్నట్టుగా కనిపించే అనుష్కని చూస్తే, చిన్న పిల్లలు అదరడం ఖాయం.
వాస్తవానికి ఫిబ్రవరి 9నే విడుదల కావాల్సి వున్న ఈ సినిమా కొన్ని అనుకోని కారణాలతో వాయిదా పడింది. NH-10, ఫిల్లౌరి లాంటి చిత్రాల తర్వాత అనుష్క స్వయంగా నిర్మిస్తున్న మూడో సినిమా ఇది.