Mr.Celebrity Movie Success Meet: పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు పరుచూరి సుదర్శన్ మిస్టర్ సెలెబ్రిటీ మూవీతో ఇటీవల ఆడియన్స్ ముందుకు వచ్చాడు. రవి కిషోర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఆర్పీ సినిమాస్ బ్యానర్‌పై చిన్న రెడ్డయ్య, ఎన్.పాండు రంగారావు సంయుక్తంగా నిర్మించారు. శ్రీ దీక్ష హీరోయిన్‌గా యాక్ట్ చేయగా.. రఘుబాబు, నాజర్, ఆమని కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో తాజాగా సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. తన మనవడు హీరోగా వచ్చిన మిస్టర్ సెలెబ్రిటీ మూవీని ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తున్నారని చెప్పారు. ఈ మూవీని డైరెక్టర్ రవి కిషోర్ అన్ని తానై ముందుకు నడిపించాడని మెచ్చుకున్నారు. సెలెబ్రిటీల మీద పుకార్లు రావడం.. వాటి వల్ల ఏర్పడే పర్యవసానాలపై స్టోరీని చక్కగా డిజైన్ చేశారని అన్నారు. ప్రొడ్యూసర్ ఎక్కడా కంప్రమైజ్ కాకుండా నిర్మించారని చెప్పారు. ఈ మూవీని చూడని వాళ్లు ఇంకా ఎవరైనా ఉంటే తప్పకుండా చూడాలని కోరారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: PM Internship Scheme: మీకు నచ్చిన కార్పోరేట్ కంపెనీలో పనిచేయాలని ఉందా? అయితే పీఎం ఇంటర్న్ షిప్ స్కీం ద్వారా ఇలా అప్లై చేయండి 


ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ మాట్లాడుతూ.. తనకు పరుచూరి బ్రదర్స్‌తో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. ఇంద్ర మూవీ కోసం రేయింబవళ్లు కష్ట పనిచేశామని గుర్తు చేసుకున్నారు. వారి మనవడు సుదర్శన్ మిస్టర్ సెలెబ్రిటీ మూవీ హీరోగా వచ్చాడని.. ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోందన్నారు. రఘుబాబు కామెడీకి అందరూ నవ్వుతున్నారని.. వరలక్ష్మీ, నాజర్, ఆమని అందరూ చక్కగా నటించారని మెచ్చుకున్నారు. నటుడు రఘుబాబు మాట్లాడుతూ.. మిస్టర్ సెలెబ్రిటీని ప్రేక్షకులు ఆదరించి.. పెద్ద హిట్‌ను అందించారని అన్నారు.


మూవీలో పెద్ద ఆర్టిసులున్నారని ఆడియన్స్ హిట్ చేయలేదని.. మంచి కథ, నటీనటులు అద్భుతంగా నటించడంతో మంచి విజయం దక్కిందన్నారు. పరుచూరి లెగసీని సుదర్శన్ బాబు ముందుకు తీసుకువెళ్లాడని అన్నారు. హీరోయిన్ శ్రీ దీక్ష కొత్త అమ్మాయి అయినా.. చక్కగా నటించిందన్నారు. సినిమాలో ట్విస్ట్ సూపర్‌గా ఉందని.. డైరెక్టర్ రవి కిషోర్ పెద్దస్థాయికి వెళతాడని అనిపిస్తోందన్నారు. ఈ సినిమాను అందరూ థియేటర్‌లో చూడాలని కోరారు. ప్రొడ్యూసర్ పాండు రంగారావు మాట్లాడుతూ.. మిస్టర్ సెలెబ్రిటీని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పారు. 


డైరెక్టర్ చందిన రవి కిషోర్ మాట్లాడుతూ.. తమ సినిమాకు అన్ని చోట్లా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు. కథ విన్న వెంటనే పరుచూరి వెంకటేశ్వరరావు మెచ్చుకున్నారని.. స్క్రిప్ట్‌ మీద ఆయన చేయి పడడంతో మూవీ పెద్ద హిట్ అయిందన్నారు. హీరో సుదర్శన్ సపోర్ట్‌తో మూవీకి మంచి ప్రమోషన్స్ దక్కాయన్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్ సినిమాకు ప్రధాన బలం అని చెప్పారు. 


Also Read: Central Home Minister: తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సీఎం, డీజీపీలతో అమిత్ షా కీలక భేటి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.