Bheemla Nayak Pre-Release Event: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan), రానా దగ్గుబాటి కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం 'భీమ్లా నాయక్'(Bheemla Nayak). ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ సోమవారం రాత్రి విడుదల అయింది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇందులో నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మురళీశర్మ, రావు రమేష్, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రల్లో నటించారు. తమన్ సంగీతమందించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్​టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.    బుధవారం సాయంత్రం భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్  ఈవెంట్ (Bheemla Nayak Pre-Release Event) జరగనుంది. ఈమేరకు మేకర్స్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 


తాజాగా 'భీమ్లా నాయక్' సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో పవన్ అభిమాని గుడిలో 'భీమ్లా నాయక్ పోస్టర్‌' (Bheemla Nayak Poster) పెట్టి పూజలు చేస్తారు. దీనిని బట్టి పవన్ మేనియా ఏంటో అర్థమవుతోంది. పవన్ కల్యాణ్ పై ప్రేమ అంటే ఇది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 




Also Read: Bheemla Nayak Trailer: సోషల్ మీడియాలో భీమ్లా నాయక్ మాస్ జాతర.. ట్రైలర్ కు వన్ మిలియన్ లైక్స్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి