Pawan Kalyan Suicide : 17 ఏళ్లకే సూసైడ్ ఆలోచనలు.. అన్నయ్య అలా అనేసరికి.. పవన్ కళ్యాణ్ కామెంట్స్
Pawan Kalyan Suicide పవన్ కళ్యాణ్ చదువుల్లో అంత చురుగ్గా ఉండేవాడు కాదు. ఇంటర్ కూడా ఫెయిల్ అయ్యాడు. ఇక చదువు వంట బట్టడం లేదని, డిప్రెషన్లోకి వెళ్లిన పవన్ కళ్యాణ్ సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాడట. ఈ విషయాన్ని ఇది వరకు ఎన్నో సార్లు చెప్పుకొచ్చాడు.
Pawan Kalyan Suicide పవన్ కళ్యాణ్ చదువుల్లో అంతంత మాత్రమేనని అందరికీ తెలిసిందే. ఇక రాజకీయ ప్రసంగాల్లో పవన్ కళ్యాణ్ తన చదువుల గురించి ఒక్కో చోట ఒక్కోలా చెప్పడం మీద జరిగిన ట్రోలింగ్ అందరికీ తెలిసిందే. అయితే ఇంటర్ ఫెయిల్ అయిన సమయంలో మాత్రం ఎంతో మథన పడ్డాడట. ఏం చేయాలో తెలియని దిక్కు తోచని స్థితిలో ఉన్నాడట. అప్పుడు చిరంజీవి, నాగబాబు ఇలా అంతా కలిసే ఉన్నారట.
అలా దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు అడవుల్లోకి వెళ్దామనే థాట్స్ కూడా వచ్చాయట. ఇంటి నుంచి పారిపోదామని కూడా అనుకున్నాడట. ఇక చిరంజీవికి ఉన్న లైసెన్స్డ్ గన్‌తో కాల్చుకుని చనిపోవాలని అనుకున్నాడట. కానీ చిరంజీవి ఇచ్చిన ధైర్యం, చెప్పిన మాటలే తనను మార్చాయని అంటూ పవన్ కళ్యాణ్ ఇది వరకు ఎన్నో సార్లు ఎన్నో వేదికల మీద చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ మరోసారి అన్ స్టాపబుల్ షోలో చెప్పాడు.
పవన్ కళ్యాణ్ సూసైడ్ థాట్స్ గురించి చెప్పుకొచ్చాడు. నాడు జరిగిన విషయాన్ని మరోసారి చెప్పుకొచ్చాడు. పదిహేడేళ్ల వయసులో గన్‌తో కాల్చుకుని చనిపోదామని అనుకున్నా.. ఓ రోజు సురేఖ వదిన, నాగబాబు అన్నయ్య ఏమైందని అడిగితే ఏదో ఆలోచిస్తూ కాల్చుకుందామని అనుకుంటున్నా అని చెప్పా. చిరంజీవి అన్నయ్య దగ్గరకు తీసుకెళ్తే చదవకపోయినా పర్లేదు.. బతికుంటే చాలని ధైర్యం చెప్పారు అంటూ నాడు చిరు మాటలను గుర్తు చేసుకున్నాడు.
అలా చిరు ఇచ్చిన ధైర్యంతో, వదిన ప్రోద్భలంతో సినిమాల్లోకి వచ్చాడు పవన్ కళ్యాణ్. అనతి కాలంలోనే పవర్ స్టార్‌గా మారాడు. చిరు స్థాయిలో క్రేజ్‌ను, ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. ఇప్పుడు జనసేన అంటూ ఏపీలో తన మార్క్ రాజకీయాలు చేస్తున్నాడు. తాను ఎప్పుడూ నటుడిని అవ్వాలని అనుకోలేదని, కానీ అలా జరిగిపోయిందని అంటాడు పవన్ కళ్యాణ్. బ్రహ్మచారిగా ఉండిపోదామని అనుకున్నవాడిని మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చిందని కూడా అంటాడు.
Also Read: Sreeleela Latest Photos : శ్రీలీల.. పెడుతోంది గుండెల్లో గోల.. చూస్తే తట్టుకోలేరంతే
Also Read: SSMB 28 Look : మహేష్ బాబు లెటెస్ట్ లుక్.. మరింత తగ్గిపోయాడే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి