Pawan Kalyan acted in Megastar Chiranjeevi God Father: మెగాస్టార్ వరుస సినిమాలను లైన్ లో పెట్టారు. అందులో గాడ్ ఫాదర్ సినిమా కూడా ఒకటి. ఆచార్య భారీ డిజాస్టర్ తర్వాత తెలుగు ప్రేక్షకులను అలరించి ఎలా అయినా హిట్టు అందుకోవాలనే ఉద్దేశంతో ఆయన గాడ్ ఫాదర్ సినిమాతో అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ అనే సినిమాకు ఇది తెలుగు రీమేక్ గా రూపొందింది. రీమేక్ స్పెషలిస్ట్ గా పేరు ఉన్న డైరెక్టర్ మోహన్ రాజా ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. రామ్ చరణ్ కి చెందిన కొణిదెల ప్రొడక్షన్స్ సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ల మీద ఎన్వీ ప్రసాద్, ఆర్బీ చౌదరి ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చిరంజీవి భార్య కొణిదెల సురేఖ సమర్పిస్తున్న ఈ సినిమా మీద ముందు నుంచి నెగిటివ్ టాక్ గట్టిగా ఉంది. ఎందుకంటే లూసిఫర్ అనే సినిమా తెలుగు వర్షన్ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. అమెజాన్ లో చూసిన వాళ్లే లక్షల్లో ఉంటే టెలిగ్రామ్ ఛానల్స్, ఐబొమ్మ వంటి వివిధ మాధ్యమాల ద్వారా చూసిన వారు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఇప్పుడు కచ్చితంగా లూసిఫర్ సినిమాని గాడ్ ఫాదర్ సినిమాని కంపేర్ చేసి చూడటం ఖాయం. అందుకే ఈ సినిమాలో అదనపు హక్కుల కోసం నయనతార, సల్మాన్ ఖాన్ వంటి వారిని రంగంలోకి దించింది. సినిమా యూనిట్ అంతేకాక మలయాళంలో లేని ఒక ఐటెం సాంగ్ కూడా సృష్టించారు.


అలాగే చిరంజీవి, సల్మాన్ ఖాన్ కాంబినేషన్లో ఒక మాస్ పెప్పీ నెంబర్ ను కూడా యాడ్ చేశారు. ఇదిలా ఉండగా మలయాళంలో ఒక యువ హీరో కీలక పాత్ర పోషించిన పాత్రను ఏకంగా లేపేసినట్లుగా ప్రచారం జరిగింది. దాన్ని తెలుగు వెర్షన్ కి తగినట్లుగా రకరకాల మార్పులు చేశారనే ప్రచారం చాలా రోజుల నుంచి ఉంది. అయితే సినిమా మరి కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సమయంలో ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా భాగమైనట్లుగా ప్రచారం ఇబ్బందిగా ఉంది. మలయాళంలో టోవినో థామస్ పోషించిన పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ పోషించబోతున్నారని తెలుస్తోంది.


మలయాళ ఒరిజినల్ వెర్షన్ లో చూసినట్లయితే టోవినో థామస్ విదేశాల్లో ఉంటూ తండ్రి చనిపోతే తండ్రి పార్టీ పగ్గాలు చేపట్టేందుకు తన బావ స్కెచ్ లో భాగంగా ఇండియా వస్తాడు. ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ అదే పాత్ర పోషించబోతున్నారని తెలుస్తోంది. ఎలా అయితే లూసిఫర్ లో క్లైమాక్స్లో ట్విస్ట్ ఇచ్చి నేను అన్నయ్య ఒక్కటే అని అందరికీ షాక్ ఇస్తాడని అంటున్నారు. ఈ సినిమాలో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అదే విధంగా తన సోదరుడు చిరంజీవికి అండగా నిలబడతారని ప్రచారం జరుగుతోంది. దానికి తోడు ఈ సినిమాలో వాడిన పార్టీ జెండాలు అన్నీ కూడా జనసేనకు దగ్గరగా ఉండటంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సినిమాలో భాగమయ్యారు అనే ప్రచారం ఊపందుకుంది.


అయితే ఈ విషయాన్ని సినిమా రిలీజ్ అయ్యే వరకు దాచి పెట్టాలని సినిమా యూనిట్ తీవ్రంగా ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే సినిమా యూనిట్ కి సంబంధించిన సన్నిహిత వర్గాల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఇది ఎంతవరకు నిజమవుతుందనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో భాగమవడం నిజమే అయితే ఆ కాంబో చూడడానికైనా ప్రేక్షకులు థియేటర్ల వరకు వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి.


Also Read: Prabhas In Controversy: వివాదంలో ప్రభాస్.. పెదనాన్న పోయి నెల కూడా కాకుండానే పూజలా? ఇదేం పద్దతి?


Also Read: Telugu Movies Releasing This Week : ఒకే రోజు థియేటర్లలో 3, ఓటీటీలో 10 సినిమాలు !



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook