BRO Trailer: పవన్ డైలాగ్స్.. తేజ్ రియాక్షన్స్.. ఆకట్టుకుంటున్న `బ్రో` ట్రైలర్..
BRO Trailer: మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. పవన్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
BRO Movie Trailer: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan), ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) కలిసి నటించిన లేటెస్ట్ మూవీ 'బ్రో'(Bro Movie). నటుడు కమ్ డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వం వహిస్తోన్న రిలీజ్ కు రెడీ అయింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ మంచి రెస్పాన్స్ సాధించాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను (BRO Trailer) రిలీజ్ చేశారు మేకర్స్. పవన్‌కల్యాణ్ పంచ్ డైలాగ్‌లు, సాయి ధరమ్ తేజ్ అదిరిపోయే రియాక్షన్స్ తో ఆకట్టుకుంటోంది.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను జూలై 28న రిలీజ్ చేయనున్నారు. ఇందులో పవన్ కల్యాణ్ దేవుడి పాత్రలో కనిపించనున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఈ మూవీ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు మేకర్స్. ఈ మూవీ ప్రీరిలిజ్ ఈవెంట్ ను జూలై 25న చేయబోతున్నట్లు తెలుస్తోంది. వినోదయ సీతం అనే తమిళ సినిమాకు ఇది రీమేక్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందించారు. ట్రైలర్ చూస్తుంటే పవన్, తేజ్ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read: Asvins Movie: ఓటీటీలో వచ్చేసిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ 'అశ్విన్స్'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook