BRO Movie box office collection Day 2: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఆయన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ లీడ్ రోల్స్ చేసిన చిత్రం 'బ్రో'(BRO Movie). జూలై 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ రోజు మంచి రెస్పాన్స్ అందుకుంది. పవన్ మేనియాతో తొలి రోజు భారీగా ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా.. రెండో రోజు అదే హవాను కొనసాగించలేకపోయింది.  ఫస్ట్ డే రూ.30 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. రెండో రోజు సుమారు రూ.22 కోట్లు రాబట్టినట్లు సమాచారం. రెండు రోజుల కలెక్షన్స్ తోనే ఈ సినిమా రూ.50 కోట్ల క్లబ్ లోకి చేరినట్లయింది.  అయితే వీకెండ్ అవ్వడం వల్ల ఆదివారం ఈ మూవీ కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'వినోద‌య సిత్తం' అనే తమిళ సినిమాకు రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌, కేతికా శ‌ర్మ కథానాయికలుగా నటించారు. స్పెష‌ల్ సాంగ్‌లో ఊర్వ‌శి రౌటేలా సందడి చేసింది. ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై టీజీ విశ్వ‌ప్ర‌సాద్ నిర్మించారు. ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్(Trivkram) స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించారు. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ యాక్టింగ్ కు మంచి మార్కులే పడ్డాయి. పవన్ మేనియా ఇదే విధంగా కొనసాగితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించే అవకాశం ఉంది. అయితే మరోవైపు ఈ మూవీపై సోషల్ మీడియాలో నెగిటివ్ టాక్ వస్తుంది. ముఖ్యంగా త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ పరమ చెత్తగా ఉన్నాయంటూ ట్రోల్ చేస్తున్నారు. 


Also Read: Sanjay Dutt First look: 'డబుల్ ఇస్మార్ట్‌'లో సంజయ్ దత్.. అంచనాలను పెంచేసిన ఫస్ట్ లుక్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook