Chiranjeevi Guinness Record: గిన్నీస్ రికార్డులో అన్నయ్య.. తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రత్యక అభినందనలు..
Chiranjeevi Guinness Record: మెగాస్టార్ కీర్తి కిరీటంలో మరో అవార్డు వచ్చి చేరింది. ఇప్పటికే పద్మవిభూషణ్ సహా పలు అవార్డులు అందుకున్న మెగాస్టార్ పేరు గిన్నీస్ బుక్ లో ఎక్కింది. దీంతో చిరుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. అన్నయ్య పేరు గిన్నీస్ బుక్ లో ఎక్కడం ప్రత్యేకంగా అభినందించారు.
Chiranjeevi Guinness Record: చిరంజీవి గత కొన్నేళ్లుగా పలు అవార్డులు వరిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో పాటు.. దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ అందుకున్నారు. తాజాగా చిరంజీవి తన 156 చిత్రాల కెరీర్ లో 537 పాటలు.. .. 24వేలకు స్టెప్స్ తో అలరించిన నటుడిగా చిరంజీవి పేరు చేరడంపై జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అన్నయ్య పేరు గిన్నీస్ బుక్ లో ఎక్కడంపై తన సంతోషాన్ని వ్యక్తం చేసారు. ‘ద మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియన్ సినిమా’ అని గౌరవించడం తనతో పాటు అభిమామానులైన ప్రతి ఒక్కరికీ ఆనందాన్నిస్తుందన్నారు. ఈ సందర్బంగా అన్నయ్య చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నట్టు ఓ లేఖ విడుదల చేశారు.
చిరంజీవి విషయానికొస్తే.. తన 46 యేళ్ల కెరీర్ లో దాదాపు 25 యేళ్లు నెంబర్ వన్ హీరోగా టాలీవుడ్ లో సత్తా చాటారు. ఆయన పక్కకు తప్పుకున్నా.. ఇప్పటికీ ఆ సీటు ఖాళీగా ఉంది. ప్రస్తుతం తెలుగులో నెంబర్ వన్ హీరో అంటూ ఎవరు లేరు. దాదాపు అర డజను పైగా హీరోలు నెంబర్ వన్ స్థానం కోసం పోటీ పడుతున్నారు. పవన్ కళ్యాణ్ ను పక్కన పెడితే.. ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి హీరోలు తమ తమ సినిమాలతో అలరిస్తున్నారు.
చిరంజీవి విషయానికొస్తే.. గతేడాది ‘భోళా శంకర్’ మూవీతో పలకరించిన అన్నయ్య.. త్వరలో ‘విశ్వంభర’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాను ‘బింబిసార’ ఫేమ్ వశష్ఠ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!
ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.